సుహాస్, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా ఛాయ్ బిస్కెట్ సందీప్ రాజ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా కలర్ ఫోటో. ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్ష్ణగా సునీల్ విలన్ గా నటించాడు. థియేటర్ రిలీజ్ కష్టమని భావించి ఆహా ఓటిటిలో ఈ సినిమా రిలీజ్ చేశారు. ఇంతకీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఉందా లేదా అన్నది చూస్తే..

మచిలీపట్నంకి దగ్గరలో ఉన్న చిన్న పల్లెటూరులో పాలు అమ్ముతూ జీవనం సాగించే జయకృష్ణ (సుహాస్). కష్టపడి ఇంజినీరింగ్ సీటు సంపాదిస్తాడు. తన క్లాస్ మేట్ దీప్తి వర్మ (చాందిని చౌదరి)ని చూసి ఇష్టపడతాడు. అయితే ఆమె కలర్ తన కలర్ వేరని ఆమెకు చెప్పడానికి వెనకాడతాడు. అయితే దీప్తి వర్మ వచ్చి జయకృష్ణకు లవ్ ప్రపోజ్ చేస్తుంది. వీరిద్దరు ప్రేమించుకోవడం దీప్తి వర్మ అన్నయ్య రామరాజు (సునీల్)కు అసలు నచ్చదు. వారిద్దరిని విడదీయడానికి ప్రయత్నిస్తాడు. ఇంతకీ ఈ ఇద్దరు ప్రేమికులు ఎలా కలిశారు అన్నది సినిమా.

సుహాస్, చాందిని తమ పాత్రల మేరకు బాగానే చేశారు. సునీల్ కూడా విలన్ గా ఆకట్టుకున్నాడు. 1997 బ్యాక్ డ్రాప్ లో సినిమా నడుస్తుంది. ఇక ఈ సినిమా కథ కులాలు, మతాలు అన్న కాన్సెప్ట్ తో ప్రేమికులను విడదీస్తారు కాని కలర్ ను చూసి ప్రేమికులను విడదీయాలన్న కాన్సెప్ట్ తో వచ్చింది. లైన్ బాగున్నా దాన్ని రెండు గంటల సినిమాగా తెరకెక్కించడంలో సాగదీసినట్టు అనిపిస్తుంది.

కామెడీ అక్కడక్కడ బాగుంది. ఎమోషనల్ సీన్స్ పెద్దగా పండలేదు. సినిమా అక్కడక్కడ బోర్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది. కాళ భైరవ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. డైరక్టర్ సందీప్ రాజ్ రొటీన్ కథ, కథనాలతో కలర్ ఫోటో తీశాడు.                              

మరింత సమాచారం తెలుసుకోండి: