ఒకే ఒక్క సినిమా అయిదుగురి కెరీర్‌కి మోస్ట్‌ ఇంపార్టెంట్‌ ప్రాజెక్ట్‌గా మారిపోయింది. సినిమా హిట్‌ అయితే ముందుకెళ్తారు‌.. లేకపోతే ఫట్ట్ అన్నట్లుగా ఉందీ పరిస్థితి. మరి అయిదుగురి కెరీర్‌కి మోస్ట్‌ ఇంపార్టెంట్‌గా మారిన ఆ సినిమా ఏంటి? ఆ అయిదుగురు ఎవరో తెలుసా.

"ఆర్.ఎక్స్.హండ్రెడ్‌'తో ఇండస్ట్రీకి బోల్డ్‌ ఝలక్‌ ఇచ్చిన అజయ్ భూపతి ఇప్పుడు "మహాసముద్రం' అనే సినిమా తీస్తున్నాడు. తెలుగు, తమిళ్‌ బైలింగ్వల్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో శర్వానంద్‌, సిద్ధార్థ్, అదితిరావ్‌ హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్‌ లీడ్‌ రోల్స్‌ ప్లే చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో నటిస్తోన్న హీరో, హీరోయిన్లు నలుగురు స్లో ఫేజ్‌లోనే ఉన్నారు.

శర్వానంద్‌కి మూడేళ్లుగా సరైన సక్సెస్‌ లేదు. ఇక సిద్ధార్థ్‌ తెలుగు ప్రేక్షకులను తక్కువ చేసి మాట్లాడాక టాలీవుడ్‌కి కూడా దూరమయ్యాడు. అదితీరావ్‌ హైదరీ తెలుగు ఆడియన్స్‌ని మెస్మరైజ్‌ చేయలేకపోతోంది. ఇక అనూ ఇమ్మాన్యుయేల్‌ "నా పేరు సూర్య, శైలజారెడ్డి అల్లుడు' రిజల్ట్స్‌తో డల్‌ అయ్యింది. ఇలా స్లో ఫేజ్‌లో ఉన్న వీళ్లకి "మహాసముద్రం' సక్సెస్‌ చాలా ఇంపార్టెంట్‌ అనే చెప్పాలి.

హీరోలు, హీరోయిన్లే కాదు డైరెక్టర్‌ కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నాడు. "మహాసముద్రం' సినిమాకి హీరోగా రవితేజ పేరు వినిపిస్తోన్న టైమ్‌లో "చీప్‌ స్టార్' అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు అజయ్ భూపతి. అప్పట్లో సోషల్ మీడియాలో ఇది  వైరల్‌ అయ్యింది. అజయ్‌ భూపతికి హెడ్‌ వెయిట్‌ ఎక్కువనే కామెంట్స్‌ కూడా వచ్చాయి. సో ఈ విమర్శలకి సమాధానం చెప్పాలంటే అజయ్ భూపతి "మహాసముద్రం'తో సూపర్‌ హిట్‌ కొట్టాలి.

మొత్తానికి అజయ్ భూపతి మహాసముద్రం సినిమాతో తన లక్ పరీక్షించుకుంటున్నాడు. తెలుగు, తమిళ్ లో బైలింగ్వల్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావ్ హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తుండటంతో అందరీ చూపు ఈ చిత్రంపైనే ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: