బిగ్ బాస్ సీజన్ 4లో ఎనిమిదవ వారం కూడా అరియానా నామినేట్ అయినట్టు తెలుస్తుంది. హౌజ్ లో గత నాలుగు వారాలుగా అరియానా నామినేట్ అవుతూ వస్తుంది. అయినా కూడా ఆమె ఆట తీరుకి ఇంప్రెస్ అవుతూ ప్రేక్షకులు కూడా ఆమెకి ఓట్లు వేస్తూ సేవ్ చేస్తూ వస్తున్నారు. గత వారం మెహబూబ్ ను సేవ్ చేసి సెల్ఫ్ నామినేట్ అయినా సరే ఈ వారం అతను కూడా అరియానాని నామినేట్ చేసి షాక్ ఇచ్చాడు.

అంతేకాదు అఖిల్ కూడా అరియానాని నామినేట్ చేశాడు. ఆమె ఎదుటి వారితో మాట్లాడే టైం లో చెప్పే విషయాన్ని కోపంగా చెబుతుందని అన్నాడు అఖిల్. ఇక అదే బ్యాచ్ లో ఉన్న సోహెల్ కూడా అరియానానే నామినేట్ చేశాడు. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో మెహబూబ్ కోసం ఆమె నామినేట్ అయిన టైం లో ఈ ముగ్గురే వచ్చి ఆమెను మెచ్చుకున్నారు కాని ఈ వారం వారే ఆమెను టార్గెట్ చేసి నామినేట్ చేశారు.

ఇక అరియానా కూడా ఈసారి మెహబూబ్, అఖిల్ లను నామినేట్ చేసింది. మెహబూబ్ లాస్ట్ వీక్ తనని సేవ్ చేసినా సరే తన హెల్ప్ కాదన్నందుకు అతను ఈరోజు ఆమెను నామినేట్ చేశాడని చెపింది అరియానా. ఇక అఖిల్ విషయంలో అంతకుముందే జరిగిన అమ్మా రాజశేఖర్ తో మాట్లాడిన విధానం నచ్చలేదని మాములుగా మాట్లాడకుండా ముందుకు వచ్చి మాట్లాడటం కూడా తనకి నచ్చలేదని చెప్పింది అరియానా. మొత్తానికి ఈ వారం కూడా అరియానా టఫ్ ఫైట్ ఇస్తుందని చెప్పొచ్చు.                                                            

మరింత సమాచారం తెలుసుకోండి: