బాలయ్య పనులు అభిమానులను మరింత ఒత్తిడికి గురి చేస్తున్నాయి. జై సింహా తర్వాత వరుస ఫ్లాపులు తలెత్తకుండా చేస్తున్నాయి. దీనికి తోడు బాలయ్య చేస్తున్న సాహసాలు అభిమానులకు నచ్చడం లేదు. బాలకృష్ణ ఏ పని చేసినా..ఫ్యాన్స్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.

హీరోలు దర్శకులుగా మారి సక్సెస్‌ అయినవాళ్లు చాలా తక్కువ మందే. అసలు మెగాఫోన్‌ పట్టడానికే చాలామంది భయపడతారు. డైరెక్షన్‌ ఎంత పెద్ద భారమో చాలామందికి తెలుసు. అందుకే.. చిరంజీవి..వెంకటేశ్‌.. నాగార్జున వంటి అగ్ర హారోలు మెగాఫోన్‌ జోలికి పోలేదు.  ఎన్టీఆర్‌..కృష్ణ వంటి ఒకరిద్దరు స్టార్స్‌ మాత్రమే దర్శకులుగా సక్సెస్‌ అయ్యారు. ఎన్టీఆర్‌ డైరెక్టర్‌ చేసిన సినిమాలు చాలా వరకు సక్సెస్‌ అయ్యాయి.

ఎన్టీఆర్‌, కృష్ణ తర్వాత ఈ జనరేషన్‌ హీరోల్లో పవన్‌కల్యాణ్‌ మెగాఫోన్‌ పట్టి 'జానీ' మూవీ తీశాడు. దర్శకుడిగా తొలి చిత్రం ఘోర పరాజయం పాలవడంతో.. ఆ తర్వాత మెగాఫోన్ వైపు చూడలేదు పవర్‌స్టార్‌. తన తండ్రిలా డైరెక్టర్ అనిపించుకోవాలనుకున్నాడు బాలయ్య. రొటీన్‌గా సోషల్‌ మూవీతో కాకుండా.. ఎన్టీఆర్ నటించి మెప్పించిన నర్తనశాల రీమేక్‌తో ముందుకొచ్చాడు. ద్రౌపతిగా సౌందర్యను.. భీముడిగా శ్రీహరిని.. ధర్మరాజుగా శరత్‌బాబును ఎంచుకున్నాడు. 16 ఏళ్ల క్రితం 2004లో షూటింగ్ లాంఛనంగా మొదలుపెట్టాడు. అయితే.. సౌందర్య మరణంతో సినిమా ఆగిపోయింది. సౌందర్య ప్లేస్‌ను మరొకరితో రీప్లేస్‌ చేయొచ్చు. కానీ కారణాలు ఏవైనా.. రెండు సీన్స్‌ చిత్రీకరణతో నర్తనశాల ఆగిపోయింది.

రెండు సీన్స్‌ చిత్రీకరణంతో ఆగిపోయిన 'నర్తనశాల'ను ఎటీటీలో రిలీజ్‌ చేసి  వినోదం పంచాలనుకున్నాడు బాలయ్య. తండ్రి నర్తనశాలలోని సీన్స్‌ యాడ్‌  చేసి రిలీజ్‌ చేశారు. సినిమాకు మంచి స్పందన వస్తే.. నర్తనశాల షూట్‌ను కంటిన్యూ చేస్తానని ప్రమోషన్‌లో చెప్పాడు బాలయ్య. అయితే ఆ చాన్స్‌ లేకుండా ప్రేక్షకులు తీర్పు ఇచ్చారు. 16 నిమిషాల నర్తనశాల అభిమాలను కూడా భయపెట్టింది. బాలయ్య సాదాసీదా టేకింగ్‌ ఆడియన్స్‌ను విసుగెత్తించింది. దర్శకుడిగా ఆకట్టుకోవడంతో... ఫెయిల్‌ అయ్యారు బాలయ్య. మొత్తానికి నర్తనశాలను కంటిన్యూ చేయడం కాదు కదా.. మరోసారి మెగాఫోన్‌ పట్టాలంటే.. భయపడే పరిస్థితికి వచ్చాడు బాలయ్య. రెండే రెండు సీన్స్‌ దర్శకుడిగా బాలయ్య ఏమిటో తేల్చేశాయి.





మరింత సమాచారం తెలుసుకోండి: