అఖిల్ తన తండ్రిలా రొమాంటిక్ హీరో అనిపించుకుంటాడని అక్కినేని అభిమానులు ఊహించారు. అయితే... అఖిల్ మూవీతో మాస్ ఇమేజ్ ట్రై చేసి భంగపడ్డాడు. ఆ తర్వాత హలో అంటూ.. లవ్‌స్టోరీతో పలకరించినా.. ఆడియన్స్ నుంచి రెస్సాన్స్ రాలేదు. ఇలా కాదని... మిస్టర్ మజ్ను అంటూ.. రొమాంటిక్ యాంగిల్ బయటకు తీసినా.. ఈ మిస్టర్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు.
అఖిల్.. హలో.. మిస్టర్ మజ్ను వంటి హ్యాట్రిక్ ప్లాప్ తర్వాత ఈ అక్కినేని హీరో నటిస్తున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్'. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. విజయదశమి సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. అఖిల్ మరోసారి రొమాంటిక్ హీరోగా కనిపించాడు. హీరోహీరోయిన్ల మధ్య సీన్స్ యూత్‌లో సినిమాపై క్రేజ్ పెంచాయి.
వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న పూజా హెగ్డే క్రేజ్ తనకు ఉపయోగపడుతుందన్న నమ్మకంతో ఉన్నాడు అఖిల్. అలా వైకుంఠపురంలో మాదిరి పూజా కూడా బుట్టబొమ్మలా కనిపిస్తోంది. ఈ అమ్మడి గ్లామర్... రొమాంటిక్ సీన్స్ సినిమాకు ఎలా ఉపయోగపడతాయో గానీ.. అఖిల్ మాత్రం.. ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. మరి ఈ నమ్మకాన్ని బొమ్మరిల్లు భాస్కర్ నిలబెడతాడో లేదో చూడాలి.
మొత్తాని అఖిల్ కు ఇప్పటికి తెలిసి వచ్చినట్టుంది. అందుకే పోయిన చోటే సక్సెస్ వెతుక్కోవాలని తెగ ఆరాటపడుతున్నాడు ఈ అక్కినేని వారసుడు. యూత్ ను ఇంప్రెస్ చేసేందుకు అఖిల్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీకావు. ఇప్పటి వరకు అయితే అఖిల్ రొమాన్స్ ను వీడ లేదు. మిస్టర్ మజ్ను ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా.. రొమాంటిక్ ను మాత్రం ఆయన విడిచిపెట్టలేదు.చూద్దాం.. రాబోయే రోజుల్లో కొత్త ప్రయోగాలు చేస్తాడేమో.