త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమా ప్లాఫ్ కావడంతో మరొక సినిమా చేయాలని సిద్ధం అయ్యాడు. కానీ పవన్ కళ్యాణ్ కి సమయం లేక పోవడం తో కుదరడం లేదు. ఇది ఇలా ఉండగా పవర్ స్టార్ మాత్రం దసరా పండుగ మరో సినిమాకు ఓకే చెప్పాడు. మాటల మాంత్రికుడుకి ఈ విషయం బాగా హార్ట్ చేసింది. ఆ సినిమా వివరాల్లోకి వెళితే.... ఇందులో బిజూ మీనన్ నటించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటించబోతున్నాడు. చిన్న దర్శకుడు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ సినిమాకు ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇది మలయాళ సినిమా అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్. దాంతో పవన్ నటించే ఈ రీమేక్ సినిమాకు త్రివిక్రం ఓకే చెప్పనట్టు తెలుస్తోంది.
ఈ సినిమా పవన్ ని చెయ్యమని సలహా ఇచ్చింది మాత్రం మాటల మాంత్రికుడే అట. కాని ఆ సినిమాకు మాత్రం దర్శకత్వం చేయడానికి ఏ మాత్రం ముందుకు రావడం లేదు . దానికి కారణం మన మాటల మాంత్రికుడికి రీమేక్ సినిమాల పట్ల ఇష్టం లేకపోవడమే. ఇలా ఈ కారణంగానే వారిరువురి మధ్య మాటల మౌనం తెరతీసిందని చెప్పుకోవచ్చు.