ప్రస్తుతం  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న  మెగా ఫ్యామిలీలో ఇప్పటికే అరడజనుకు పైగా యువ హీరోలు ఇండ్రస్టీకీ ఎంట్రీ ఇచ్చారు. కానీ వారిలో సక్సెస్ అయ్యి, మన మెగాస్టార్ చిరంజీవిలా మాస్ ఇమేజ్ ని సంపాదించుకుంది మాత్రం కొందరే అని చెప్పాలి. అయితే కరోనా ప్రభావంతో గత ఆరు నెలల నుంచి సినిమా పరిశ్రమ తీవ్ర నష్టాల్లో మునిగిపోయింది. షూటింగ్లు, సినిమా విడుదలలు లేక దర్శక, నిర్మాతలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక నటీ, నటులు ఎవరి ఇళ్లకు వారు పరిమితమయ్యారు. అయితే దాదాపు ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఇక ఇప్పుడు కొన్ని కండిషన్స్ తో థియేటర్స్ ఓపెన్ చేయవచ్చని కేంద్రం అనుమతి ఇచ్చింది.

కానీ థియేటర్ యాజమాన్యం మాత్రం థియేటర్స్ ఓపెన్ చేయడానికి సుముఖంగా లేరు. ఎందుకంటే థియేటర్స్ లో 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉండాలని కేంద్రం కండిషన్ పెట్టడంతో నష్టాలు వస్తాయని చాలామంది థియేటర్స్ ఓపెన్ చేయడానికి సిద్ధంగా లేరు.సినిమాలన్నీ వచ్చే సంవత్సరానికి వాయిదా పడ్డాయి.ఇటు సినిమా షూటింగ్ లు కూడా చక చకా జరిగిపోతున్నాయి. అందరూ హీరోలు తమ తమ షూటింగుల్లో పాల్గొంటున్నారు. ఇక ఇదిలా ఉంటె ప్రస్తుతం మెగా ఫ్యామిలీకి చెందిన సినిమాలు ఒకటి కాదు రెండు కాదు.. దాదాపుగా 15 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

 ఈ సినిమాలన్నీ వచ్చే సంవత్సరం మొదటి నుంచి చివరి వరకు విడుదల అయ్యి అభిమానుల్ని అలరించనున్నాయి. ఇక మెగా సినిమాల హడావుడి 2021 సంక్రాంతి నుంచి మొదలు కానుంది. ముందుగా సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత నుంచి చిరంజీవి, అల్లు అర్జున్, రాం చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు శిరీష్ ల సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి విడుదల అయి 2021 ఇయర్ కాస్తా మెగా ఇయర్ గా మారబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: