చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ పేరు తెలియని వారు ఉండరు. మెగా స్టార్ కూతురు శ్రీజని ప్రేమ పెళ్లి చేసుకావడంతో కొంత కాలం ఈ జంట వార్తలు మీడియాకు హాట్ టాపిక్ గా ఉండేవి. అభిప్రయభేదాలతో విడిపోయిన ఈ జంట కోర్టు నుండి లీగల్ డైవర్స్ కూడ తీసుకుంది. అయితే కొద్ది విరామం తీసుకుని శిరీష్ మళ్ళీ వార్తలకు ఎక్కాడు.  తాజాగా యాంకర్ కమ్ యాక్ర్టెస్ శ్రీలేఖ బర్త్‌డే పార్టీలో శిరీష్ ప్రత్యక్షమయ్యాడు. శ్రీలేఖతో సరదాగా పార్టీ ఎంజాయ్ చేస్తున్న శిరీష్‌ని చూసిన జనం రకరకాలుగా అనుకుంటున్నారు. ఎలాగూ విడాకులు వచ్చాయి కదా అనుకున్నాడో ఏమోకానీ శిరీష్ మాత్రం ఇలా పార్టీలు ఎంజాయ్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు అనే టాక్ ఉంది. శిరీష్ ను చిరంజీవి వ్యతిరేక వర్గం కొంతమంది చేరతీస్తున్నారు అనే టాక్ కూడ ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యూత్ కార్య వర్గంలో కొంతకాలం పనిచేసిన శిరీష్ ప్రస్తుతం మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు అనే టాక్ కూడ ఉంది. ఈ బర్త్‌డే పార్టీలో సంపూర్ణేష్ బాబు కూడా సందడి చేయడం కనిపించింది.  గత కొంత కాలంగా వార్తలకు, వివాదాలకు దూరంగా ఉన్న శిరీష్ మళ్ళీ యాక్టివ్ అవతారం ఎత్తిన వెనుక ఏదైనా ఎత్తుగడలు వేస్తున్నాడా అనే ప్రశ్నలు కూడ వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: