తాజాగా రామ్ ఫోటో షూట్ లో పాల్గొనడం జరిగింది. ఫార్మల్ లుక్ తో అదరగొట్టేశాడు ఈ హీరో. ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఫోటో లో రామ్ లైట్ గడ్డం, వైట్ షర్ట్, డార్క్ కలర్ ప్యాంట్ విత్ మ్యాచింగ్ ట్రౌజర్స్ లో ఓ చేతి లో కంప్యూటర్ , మరో చేతి లో పెన్ను పట్టుకుని ఎదో ఆలోచిస్తున్నట్టు స్టిల్ ఇవ్వడం జరిగింది.
ఇలా ఫొటోలు అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. నిజంగా ఎదో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టే అనిపిస్తోంది. ఈ ఫోటో లని షేర్ చెయ్యడమే కాక మంచి కేప్షన్ ని కూడా అందించాడు ఈ హీరో. ఆ విషయానికి వస్తే ... ' ఇంటి దగ్గరున్నా..పనిలో ఉన్నా, ఫార్మల్ లో వెళ్లండి.. సులభంగా వెళ్లండి ' అంటూ # WFH Look (వర్క్ ఫ్రమ్ హోం) ఫొటో కు క్యాప్షన్ ఇచ్చాడు .