"చిరంజీవి ఎంత బాగా టైమింగ్ మెయిన్‌టైన్ చేస్తారో నాకు బాగా తెలుసు. పొద్దున్నే ఏడు గంటలకంటే ఏడు గంటలకు ఆయన సెట్స్ మీదుంటారు. ఇప్పటి జనరేషన్‌లో చాలామంది మెల్లిగా వెళ్దాంలే అనుకుంటూ ఉంటారు. కానీ రామ్‌చరణ్ కూడా అచ్చం చిరంజీవిగారి లాగే ఏడు గంటలకు సీన్ తీయాలంటేఏ ఆ టైమ్‌కు సెట్‌లో ఉంటాడు. ఆ అంకితభావం అతనిలో ఉంది. అలాగే సబ్జెక్ట్ మీద ఎంతో ఇన్‌వాల్వ్‌మెంట్ చూపిస్తాడు. ఆ విషయంలో ఇద్దరూ ఒకే రకంగా అనిపించారు" అని చెప్పాడు శ్రీకాంత్.ఇక ఇటీవల శ్రీకాంత్ నటించిన సినిమాలన్నీ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోయాయి.
అందుకే ఇప్పుడు అటు హీరోగా, ఇటు అగ్ర హీరోల సినిమాల్లో కీలకమైన పాత్రల్లో కూడ నటిస్తున్నాడు. ఇక నెగిటివ్ రోల్స్ కూడ శ్రీకాంత్ నటించడానికి మొగ్గుచూపుతున్నాడట. ఈ మధ్యే బాలయ్య, బోయపాటి మూవీలో శ్రీకాంత్ ని ఓ నెగిటివ్ రోల్ కోసం అడిగారని తెలుస్తోంది. ఇదిలా ఉంటె శ్రీకాంత్ నటించిన 'పెళ్లిసందడి'రీమేక్ లో ఆయన తనయుడు రోషన్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయాన్నీ స్వయంగా దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు తెలపడం విశేషం...!!