అప్పట్లో యువరత్న, తర్వాత బాక్సాఫీస్ బొనాంజా.. ఇప్పుడు నందమూరి నట సింహం.. ఇవన్నీ హీరో బాలకృష్ణకు ఉన్న పేర్లే. తెరపై గర్జించే పాత్రలు చేయడం బాలయ్యకు వెన్నతో పెట్టిన విద్య. ఆయనతో ఓ దర్శకుడికి సెట్ అయిందంటే వారే వరుసగా సినిమాలు తీస్తారు. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు వారి మైండ్ సెట్ కు సెట్ అవుతుంది. అలానే పలు హిట్లు ఇచ్చారు బాలయ్య. కోడి రామకృష్ణ, బి.గోపాల్, బోయపాటి శ్రీను.. ఈ లిస్టులో ఉన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ మాస్ డైరక్టర్ బోయపాటితోనే ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్ల విషయంపై పలు వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్లుగా పలువురి పేర్లు రౌండ్ అయ్యాయి. శ్రియ, అంజలి పేర్లు ప్రధానంగా రౌండ్ అయ్యాయి. అయితే.. బోయపాటి మళయాళం నుంచి ప్రగ్యా మార్టిన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు పలువురి పేర్లు వినిపించినా చివరకు పూర్ణను ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ విషయంపై ఎటువంటి అఫిషియల్ న్యూస్ లేకపోయినా.. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో రౌండ్ అవుతోంది. ఇప్పటికే బాలయ్య పాత్రతో రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.


ఈమధ్య తెలుగులో సీనియర్ హీరోలకు హీరోయిన్ల సమస్య వస్తోంది. ఆక్రమంలో బాలయ్య కూడా ఈమధ్య పలువురు సీనియర్ హీరోయిన్లతోనే సినిమాలు చేశారు. ఇప్పుడు బోయపాటి సినిమాకు కూడా ఇదే సమస్య వస్తోంది. కరోనా వల్ల వాయిదా పడిన సినిమా షూటింగ్ ఈనెల 16 నుంచి రామోజీ ఫిలిం సిటీలో పాటతో షెడ్యూల్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. మరి.. ఈసారైనా హీరోయిన్లు వీరేనంటూ వస్తున్న వార్తలు నిజమవుతాయో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: