ఇప్పటికే అనేక సినిమాలలో గోదావరి యాసని ఉపయోగించారు. తెలుగు సినిమాల్లో గోదారి యాసకు చాల ప్రాధాన్యత ఉంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రంగస్థలం చిత్రం లో గోదారి యాసని ఎంతో చక్కగా సుకుమార్ చూపించడం జరిగింది. రంగస్థలం చిత్రం లో  సిట్టిబాబుగా రామ్ చరణ్ మంచి నటన తో ఆకట్టుకున్నాడు. గోదారి యాసను పలికించిన తీరుకు అనేక ప్రశంసలు కూడా దక్కాయి. జమానా కాలం నుంచి స్టార్ డైరెక్టర్లు రైటర్లు వినిపియోగిస్తున్న పరిచర్య ఇది. దీనిలో కొత్తేమి లేదు.

ఇది ఇలా ఉండగా  సుధీర్ బాబు ఇటీవల `పలాస 1978` ఫేం కరుణ కుమార్ దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్టుపై సంతకం చేశారు. ఇలా యంగ్ హీరో సుధీర్ బాబు ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ సినిమా తో రానున్నాడు. విలేజీ కుర్రాడిగా కనిపిస్తానని.. తన పాత్రకు మరింత ప్రామాణికతను తీసుకురావడానికి గోదావరి మాండలికాన్ని నేర్చుకుంటున్నానని సుధీర్ బాబు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ సినిమా తో సుధీర్ బాబు  ఇప్పుడు మరో సిట్టిబాబుగా మారి గోదారి యాసను పలికించనున్నాడన్నది అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. శ్రీదేవి సోడా సెంటర్` అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కనుంది.

మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. సుధీర్ స్నేహితులు విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి సంయుక్తంగా 70 ఎంఎం ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ క్రింద ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ నెలలో షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.  ఈ చిత్రం ప్రేమ కోసం ఫైట్ అని తెలిసినదే. ఆధిపత్యం పోరాటం నేపథ్యం లో ఆసక్తికర కథాంశం తో తెరకెక్కనుంది. మనిషి లోని రకరకాల భావోద్వేగాలను రగిలిస్తుందట సుధీర్ పాత్ర. ఇటీవలే వచ్చిన `వి` ఫలితం ఆశించినంత రేంజుకు చేరకపోవడం తో సుధీర్ బాబు కాస్త జాగ్రత్తగా ఉంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: