![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/koti-music-directord23cedc4-8127-4aab-a1bd-91c1df81fe9d-415x250.jpg)
సీనియర్ సంగీత దర్శకుడు కోటి ముఖ్యపాత్ర పోషించనున్న కొత్త సినిమా సెహరి .. నేడు హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు. ఈ కార్యక్రమానికి ప్రముఖలు హాజరయ్యారు.
జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ రూపొందనుంది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆసక్తికర కథాంశంతో ఈ సెహరి మూవీ రూపొందిస్తున్నామని చిత్రయూనిట్ తెలిపింది..
మ్యూజిక్ డైరెక్టర్స్ కెమెరా ముందుకు వచ్చి నటించడం మన తమిళ్ ఇండస్ట్రీ కి కూడా ఉంది ... అప్పట్లో సంచలనం సృష్ట్టించిన బిచ్చగాడు అనే సినిమాలో హీరోగా చేసిన విజయ్ ఆంథోనీ అంతకు ముందు అతను ఒక మ్యూజిక్ డైరెక్టర్ .. తెలుగు లో మహాత్మా అనే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసారు .. ఇప్పుడు తమిళ్ లో బిజీ అయ్యారు .తాను నటించే సినిమాకి తానే మ్యూజిక్ ఇస్తున్నారు .. ఇక జి.వి ప్రకాష్ కూడా తమిళ్ లో హిరో గా చేసాడు.. జి.వి ప్రకాష్ కుమార్ కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్.. ఇతడు ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు .. అలాగే హిప్ హప్ తమిజా కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్.రాంచరణ్ నటించిన ధ్రువ సినిమాకి మరియు నాని నటించిన కృష్ణార్జునయుద్ధం సినిమాకి సంగీతం ఇచ్చారు .. . హిప్ హప్ తమిజా కూడా కొన్ని తమిళ్ l సినిమాలు చేసారు ..