సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం హిట్ జోష్ లో ఉన్నాడు..  వరుసగా 9 ఫ్లాప్ సినిమాలు చేసి చాలా డిప్రెషన్ కి గురయినా తేజు చిత్ర లహరి హిట్ తో మళ్ళీ రేస్ లో కి వచ్చేశాడు.. అప్పటివరకు సాయి ధరం తేజ్ చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇక తేజ్ కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నారు.. కానీ ఫెయిల్యూర్, సక్సెస్ కాన్సెప్ట్ తో సినిమా చేసి ప్రేక్షకులను బాగానే మెప్పించారు.. ఇక ఆ సినిమా తర్వాత మారుతీ దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజు పండగే సినిమా క్లీన్ హిట్ సాధించి సాయి ధరం ను మళ్ళీ టాప్ చైర్ లో కూర్చో బెట్టింది.. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేస్తున్నాడు..

సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ సినిమా తో పరిచయమవుతుండగా నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయినా పాటలు, టీజర్, ట్రైలర్ కి మంచి పేరు రాగ తేజు కి మరో హిట్ గ్యారెంటీ అంటున్నారు.. తమన్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్ కాగ వీరి కంబోలో వచ్చిన అన్ని చిత్రాలు మ్యుజికల్ గా  హిట్ అయ్యాయి అని చెప్పొచ్చు.. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటివరకు కొంత గందరగోళం నెలకొనగా థియేట్రికల్ రిలీజ్ లేదా డిజిటల్ రిలీజ్ అనే దానిపై అందరు డైలామాలో ఉన్నారు. అయితే మేకర్స్ ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

పరిస్థితులు అనుకూలిస్తే ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. 'చిత్రలహరి' 'ప్రతిరోజు పండగే' వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక హీరోయిన్ నభా నటేశ్ కూడా ఈ సినిమాపై ఆశలు పెట్టుకుంది. 'డిస్కోరాజా' ప్లాప్ తర్వాత నభా నటిస్తున్న ఈ సినిమా రిజల్ట్ పై ఆమె కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు. మరి సాయి తేజ్ - నభా లకు 'సోలో బ్రతుకే సో బెటర్' ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: