అదిరిపోయే హిట్‌ పడగానే.. ఫ్లాపుల్లో కూరుకుపోవడం చాలామంది హీరోలకు సెంటిమెంట్‌ అయిపోయింది. బ్లాక్‌బస్టర్‌ తర్వాత కోలుకోవడం కష్టమని కీర్తిసురేష్‌ విషయంలో నిజమైంది. కీర్తిసురేష్‌ యాక్టింగ్‌ స్కిల్స్‌ ఏమిటో మహానటి నిరూపించింది. కీర్తిని జాతీయ ఉత్తమ నటి చేసిన మహానటి తర్వాత సర్కార్‌  మినహా అన్నీ నిరాశనే మిగిల్చాయి. మరి కీర్తి హిట్‌ ఎప్పుడు చూస్తుంది.  స్టార్ హీరోలు ఆదుకుంటేగానీ.. కీర్తి జాతకం మారదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మహానటి తర్వాత కీర్తిసురేష్‌ నుంచి అదిరిపోయే రోల్స్ ‌వస్తాయని అభిమానులే కాదు కాదు అందరూ ఆశించారు. చివరికి ఏవరేజ్‌ అన్న మాట కూడా రాలేదు. మహానటి తర్వాత కీర్తి నటించిన పెంగ్విన్‌ మూవీ లాక్‌డౌన్‌ టైంలో ఓటీటీలో వచ్చిందన్న సంగతి చాలామందికి తెలీదు. మరో మూవీ మిస్‌ ఇండియా రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ అయితే.. నెగిటివ్‌ రివ్యూసే వచ్చాయి. కథలు ఎంచుకోవడంలో కీర్తి రాంగ్‌ స్టెప్స్‌ వేసింది. మరో లేడీ ఓరియెంటెడ్‌ మూవీ 'గుడ్‌ లక్‌ సఖి' టీజర్‌ చూస్తుంటే.. ఆర్ట్స్‌ ఫిలింలా అనిపిస్తోంది.

మహానటి తర్వాత హీరోలతో నటించిన సర్కార్‌ ఒక్కటే సక్సెస్ అయింది. సీక్వెల్‌ మూవీస్‌ పందెంకోడి2.. సామి2.. మన్మథుడు2 డిజాస్టర్స్‌ అయ్యాయి. ఈ డిజప్పాయింట్ టైంలో పెద్ద  సినిమాల్లో నటించడమే కాస్త ఊరట. అన్నాత్తైలో రజనీకాంత్‌తో.. వేదళం రీమేక్‌లో చిరంజీవి చెల్లిగా.. సర్కారువారి పాటలో మహేశ్‌తో జోడీ కడుతోంది కీర్తి.

కీర్తి సురేష్‌ ముగ్గురు స్టార్స్‌తో నటిస్తున్నా ఈ మూడు  సినిమాల్లో ఒక్కటీ ఇప్పట్లో రిలీజ్‌ కాదు. రజనీకాంత్‌ ఆరోగ్యం రీత్యా.. ఇప్పట్లో షూటింగ్ పాల్గొనడు. వేదళం రీమేక్ సమ్మర్‌లో మొదలవుతుంది. ఇక మహేశ్‌ సినిమా మొదలైనా.. రిలీజ్‌ కావడానికి 10 నెలలు పడుతుంది. ఈలెక్కన లేడీ ఓరియెంటెడ్‌ మూవీ గుడ్‌లక్‌ సఖితో మరోసారి ఓటీటీలో అడుగుపెడుతూ.. తనకు లక్‌ ఉందో లేదో తేల్చుకోనుంది కీర్తి. చూద్దాం కీర్తి కెరీర్ ఎలా ఉండబోతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: