దాంతో మళ్ళీ తనకు అచ్చోచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను తో చేతులు కలిపాడు బాలయ్య.. BB3 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి టీజర్ రాగ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది..ఇందులో పంచెకట్టులో మీసం మెలితిప్పుతూ మాస్ లుక్ లో బాలయ్య అలరించాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది. అయితే ఇప్పటివరకైతే మళ్ళీ షూటింగ్ ని ప్రారంభించలేదు.. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. సింహ, లెజెండ్ లాంటి సినిమా ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమా హీరోయిన్ విషయంలో చాల ఇబ్బందులు పడుతున్నారు చిత్ర బృందం.. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారన్న సంగతి తెలిసిందే. మలయాళం బ్యూటీ ప్రయాగ మార్టిన్ తో పాటు పూర్ణను తీసుకున్నారు. చాలా రోజుల కిందే లీడ్ రోల్ కు అంజలి ఓకే చెప్పింది. గతంలో ఎలాగూ బాలయ్యతో డిక్టేటర్ చేసిన ఎక్స్ పీరియన్స్ ఉండటంతో ఎస్ చెప్పింది. కానీ తాజా అప్ డేట్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుంచి అంజలి తప్పుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే ఉన్న అంజలిని నిర్మాతలు సంప్రదించినప్పుడు నిబంధనలకు సంబంధించి దేనికో ఏకాభిప్రాయం రాకపోవడంతో డ్రాప్ అయ్యిందని వినికిడి.