హీరో నితిన్ హీరోయిన్ రష్మిక మందన ప్రధానపాత్రలో నటించిన భీష్మ సినిమా జెమినీ టీవీలో అక్టోబర్ 25వ తేదీన సాయంత్రం పూట ప్రసారం అయ్యింది. అయితే ఈ సినిమా మొట్టమొదటిసారిగా టెలివిజన్ తెరపై ప్రసారం అయ్యింది. కానీ దసరా పండుగ రోజు ప్రసారమైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. చిత్ర పరిశ్రమ భాషలో చెప్పాలంటే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. కాగా.. ఈ చిత్రం కేవలం 6.65 టీవీఆర్ రేటింగ్ మాత్రమే సాధించగలిగింది. అంటే ఒక సాదా సీదా సీరియల్ కంటే తక్కువ గానే టీవీఆర్ రేటింగ్ పొందింది.


దసరా పండుగ సందర్భంగా ప్రజలంతా ఇంట్లోనే ఉన్నారు కానీ ఎవరు కూడా ఈ సినిమా చూడకపోవడం గమనార్హం. ఆ రోజు ఐపీఎల్ మ్యాచ్ లు, బిగ్ బాస్ కార్యక్రమాలు, ఈటీవీ జీ తెలుగు వంటి ఛానళ్లలో దసరా ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం అయ్యాయి. దీంతో భీష్మ పై బాగా ఎఫెక్ట్ పడింది. ఫిబ్రవరి నెలలో థియేటర్ లో రిలీజ్ అయిన భీష్మ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది కానీ బుల్లితెర మాత్రం అనేక కారణాల వలన అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.


ఇదిలా ఉండగా నితిన్ హీరోగా నటిస్తున్న రంగదే  సినిమా యొక్క షూట్ చివరి దశలో ఉంది. ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ మూవీ పై మంచి అంచనాలను ఉన్నాయి.  వెంకీ అట్లూరి దర్శకుడు మరియు ‘ఎమిటో ఇది’ పాట యొక్క లిరికల్ ప్రిల్యూడ్ ఈ రోజు విడుదల చేయబడింది.  ఈ పాటలో నితిన్, కీర్తి సురేష్ చాలా రొమాంటిక్ మూడ్‌లో ఉన్నారు. లేకపోతే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పూర్తి లిరికల్ పాట నవంబర్ 7వ తేదీన విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: