ఈ మూవీ ముందూ తరువాత అన్నంతగా కీర్తి పేరు మారుమోగింది. ఇదిలా ఉంటే ఈ పేరుతో లేడీ ఓరియెంటెండ్ మూవీస్ చేస్తూ పోదామని ఆమె అనుకున్నా కాలం కలసిరాలేదు. అవి ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. దాంతో ట్రాక్ మార్చి మళ్ళీ స్టార్ హీరోల సినిమాల్లోనే నటించేందుకు రెడీ అవుతోంది. అలా సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సర్కార్ వారి పాటలో ఆమె చాన్స్ కొట్టేసింది. ఈ మూవీ త్వరలోనే స్టార్ట్ అవుతుంది.
అయితే కీర్తి సురేష్ ట్రాక్ రికార్డు చూస్తే ఆమె స్టార్ హీరోలతో చేసిన సినిమాలు ఏవీ ఇంతవరకూ పెద్దగా హిట్ అయిన దాఖలాలు లేవట. పైగా డిజాస్టర్లు కూడా ఉన్నాయట. పవన్ 25వ సినిమా 'అజ్ఞాతవాసి' ఫ్లాప్ అయింది. అందులో ఏరి కోరి పెట్టుకున్నది కూడా కీర్తి సురేష్ నే. అలాగే తమిళనాట చూస్తే సూర్య, విజయ్, ధనుష్ లాంటి స్టార్ హీరోలతో అనేక సినిమాలు కీర్తి చేసినా అవేమీ హిట్ కాలేదుట.
ఇక ఈ అమ్మడు సొంత రాష్ట్రం మళయాలంలో కూడా స్టార్స్ చేసిన సినిమాలు ఫట్ అయ్యాయని టాక్. మొత్తానికి చూస్తే చాలా కాలానికి ఓ సూపర్ స్టార్ పక్కన కీర్తి నటిస్తోంది. మరి మహేష్ బాబు సినిమా సంగతేంటని ఫ్యాన్స్ అయితే తెగ పరేషాన్ అవుతున్నారుట. కీర్తి యాంటి సెంటిమెంట్ కనుక వర్కౌట్ అయితే సర్కార్ వారి పాట సంగతి ఏం కానూ అని బాధపడుతున్నారుట.