అనతి కాలంలో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తనకు వచ్చిన రౌడీ ఇమేజ్ కు తగినట్టుగానే సినిమాలు చేస్తున్నాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా హిట్లతో సూపర్ జోష్ మీద ఉన్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో రెండు ఫ్లాపులు అందుకున్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు పూరీ.

విజయ్ ఇమేజ్ ను నేషనల్ లెవల్ లో చూపించేందుకు పూరీ సిద్ధమయ్యాడు. సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర క్రేజీగా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా సుకుమార్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. అసలు ఏమాత్రం ఊహించని ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ తోనే అంచనాలు పెరిగాయి. క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి చేస్తే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

ఈ కాంబినేషన్ మూవీ స్క్రిప్ట్ ఫైనల్ కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తారని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర వేరే లెవల్ లో ప్లాన్ చేస్తున్నాడట సుక్కు. అల్లు అర్జున్ తో ఆర్య, ఆర్య 2 చేసినట్టుగా విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా కూడా అంతకుమించి ఉంటుందట. తప్పకుండా వీరి కాంబో స్పెషల్ మూవీ అవుతుందని అంటున్నారు.                                                              

మరింత సమాచారం తెలుసుకోండి: