బిగ్ బాస్ 4 లో కొత్త కెప్టెన్ గా అమ్మా రాజశేఖర్ సెలెక్ట్ అయ్యారు. ఈ వారం కెప్టెన్సీ పోటీ దారులుగా హారిక, అరియానా, అమ్మా రాజశేఖర్ లకు రింగులో రంగు టాస్క్ ఇవ్వగా అందులో అమ్మా రాజశేఖర్ గెలిచారు. ఇక కెప్టెన్ అయ్యాక హౌజ్ లో లొల్లి మొదలైంది. ఎవరెవరు ఏయే పనులు చేయాలి అన్న విషయంలో అమ్మా రాజశేఖర్ చెప్పిన దానికి అభిజిత్, సోహెల్, అఖిల్ ఒప్పుకోలేదు. అంతేకాదు ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసేందుకు లాస్య, మోనాల్, హారికలను ఎంపిక చేశాడు.

అవినాష్, మెహబూబ్ లకు ఓన్లీ బాత్ రూం క్లీనింగ్ ఇచ్చాడు. అయితే దీనిపై హౌజ్ మేట్స్ గొడవ పడ్డారు. బాత్ రూం క్లీనింగ్ కేవలం 20 నిమిషాలు అవుతుంది. ఆ తర్వాత డ్యాన్సులు వేస్తారా అని సోహెల్ అంటాడు. దానికి మెహబూబ్ కూడా సీరియస్ అవుతాడు. సోహెల్ కు న్వ్వు వద్దు నీ ఫ్రెండ్ షిప్ వద్దని చెబుతాడు మెహబూబ్ దానితో సోహెల్ హర్ట్ అవుతాడు.

అమ్మా రాజశేఖర్ కెప్టెన్ అవగానే కొన్ని రూల్స్ పెట్టాడు. మైక్ మర్చిపోతే జైలుకెళ్ళాలని అన్నాడు. ఇక ఇంగ్లీష్ మాట్లాడితే నాగార్జున చెప్పిన పొజిషన్ లో నిలబడాలని అన్నారు. ఇక బ్యాటరీస్ ఎవరైతే ముందు తీసుకుంటారో వారు చివర వచ్చిన వారి ఎగ్స్ తీసుకోవచ్చని అన్నారు. మొత్తానికి అమ్మ రాజశేఖర్ కెప్టెన్ గా తన వీర ప్రతాపాన్ని చూపిస్తున్నారు. అయితే అమ్మా రాజశేఖర్ ఇలా రెచ్చిపోవడం హౌజ్ లో కొందరికి నచ్చట్లేదు. కొందరు అమ్మా రాజశేఖర్ చెప్పిన పనులను చేసేందుకు కూడా సుముఖంగా లేరని తెలుస్తుంది.                                                  

మరింత సమాచారం తెలుసుకోండి: