ఇస్మార్ట్ శంకర్, మిస్టర్ మజ్ను చిత్రాల్లో నటించి మెప్పించిన 27 ఏళ్ల నిధి అగర్వాల్ ఎనలేని పాపులారిటీ సంపాదించుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తన యొక్క ఫోటోలను వీడియోలను పోస్ట్ చేస్తూ ప్రేక్షకాదరణ ను పెంచుకుంటూ పోతున్న హాట్ బ్యూటీగా నిధి అగర్వాల్ దూసుకెళ్తున్నారు. అయితే ఇటీవల నిధి అగర్వాల్ ఒక ఫోటో అని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఆ ఫోటో లో నిధి అగర్వాల్ బాత్ రూమ్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. నిధి అగర్వాల్ పైన ఒక్క బ్రా మాత్రమే వేసుకుని.. కింద ప్యాంటు ధరించి కనిపిస్తోంది. బాత్రూంలో ఈ విధంగా ఫోటో దిగి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం తో కొందరు నిధి అగర్వాల్ ని తిట్టిపోస్తున్నారు.


'బాత్రూంలో సెల్ఫీ దిగి సోషల్ మీడియా వేదికగా పెట్టడం సరైనదేనా? ఇది ఒక పబ్లిక్ వల్గర్ స్టంట్ తప్ప మరేమి కాదు' అని ఓ నెటిజెన్ నిధి అగర్వాల్ ని తిట్టిపోశారు. మరికొందరు కూడా ఈ ఫోటో బాగోలేదు అని ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ ఫోటోలో వల్గర్ గా కనిపించేంతగా అశ్లిలత ఏమీ లేదని కొందరు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఇది ఒక గ్లామర్ ఫోటో. ఇందులో పెద్దగా తప్పు పట్టడానికి ఏమీ లేదని మరికొందరు అంటున్నారు.


22 గంటల క్రితం అప్లోడ్ చేయబడిన ఈ ఫోటోకి ఇప్పటికే ఆరు లక్షల లైకులు వచ్చాయి. కాకపోతే గతంలో చైనా ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసిన నిధి అగర్వాల్ భారతీయల ఆగ్రహానికి కారణం అయ్యారు.


ఇదిలా ఉండగా.. గత ఆరు నెలల నుండి నిధి అగర్వాల్ తమిళ భాష నేర్చుకోవడానికి ఆన్లైన్ కోర్స్ లో పాల్గొంటున్నారు. తమిళ భాషపై పట్టు సాధించి తమిళ సినిమాలో అద్భుతంగా నటించాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె హీరో శింబు సినిమాలో నటిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: