ఎక్కడో వున్న బిగ్‌బాస్‌ను. ఇంకెక్కడికో ఎక్కడికో తీసుకెళ్లింది సమంత. బిగ్‌బాస్ 4వ సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ మధ్య వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ కోసం హిమాలయాలు వెళ్లాల్సి వస్తే.. బిగ్‌బాస్ హౌస్‌ను నడిపే బాధ్యతను కోడలు సమంతకు అప్పజెప్పాడు అక్కినేని నాగార్జున.
సమంత హోస్ట్‌గా ఎలా చేస్తోందన్న ఆసక్తి బిగ్‌బాస్ అభిమానుల్లో నెలకొంది. సమంత బిగ్‌హౌస్ హౌస్‌లోకి అడుగుపెట్టగా.. ఈ ప్రోగ్రామ్ 3 గంటలు సాగింది. తెలుగులో బాగానే మాట్లాడే సామ్స్... ఒకరమైన యాసతో ఆకట్టుకుంది . స్పాంటేనియస్‌గా పంచ్‌లు వేసి ఆకట్టుకుంది. సమంత హోస్ట్‌గా వ్యవహరించిన ఎపిసోడ్‌కు మంచి రేటింగ్ వచ్చింది. నెల రోజులుగా నాగ్ పాల్గొంటున్న షోస్ కంటే ఎక్కువ రావడం విశేషం.
బిగ్‌బాస్ 4 ప్రారంభమైన రోజు గత మూడు సీజన్స్ కంటే ఎక్కువ రేటింగ్ వచ్చింది. అయితే.. ఆ తర్వాత తగ్గుతూ రావడం నిర్వాహకులను నిరాశపరిచింది. బిగ్‌బాస్ అభిమానులు కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ తగ్గిన రేటింగ్‌ను సామ్స్ పైకి తీసుకొచ్చింది. ఇది సమంత టాలెంటే అనడానికి వీల్లేదు. మూడు గంటలపాటు సాగిన షోలో స్పెషల్ ఎట్రాక్షన్స్ చాలా ఉన్నాయి. పాయల్ రాజ్‌పుత్ డ్యాన్స్.. హైపర్ ఆది కామెడీ.. అఖిల్ ఎంట్రీతో సమంత ఎపిసోడ్ కొత్త హంగులు అద్దుకుంది. దీనికి తోడు హోస్ట్‌గా సామ్స్ కూడా ఆకట్టుకుంది. మొత్తానికి బిగ్‌బాస్ రేటింగ్ పెంచి మామకు తగ్గ కోడలు అనిపించుకోవడమే కాదు.. నాగార్జునకు సవాల్ విసిరింది. నెక్ట్స్ ఎపిసోడ్స్‌లో సమంత ఎపిసోడ్ కంటే తక్కువ వస్తే.. మామ కంటే కోడలే బెటర్ అంటూ ట్రోల్ చేస్తారన్న భయం నాగ్‌కు లేకపోలేదు. మొత్తానికి సమంత నాగార్జుకు తగ్గ కోడలని నిరూపించుకుంది.