బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అనంతరం... వెలువరించిన పలు అనుమానాలలో, డ్రగ్స్ కోణం అందరినీ హడలెత్తిచ్చింది... ఈ ఆత్మ హత్య కేసు చిక్కు ముడి వీడలేదు కానీ.. డ్రగ్స్ విషయానికి సంబంధం ఉన్నట్లు మెల్ల మెల్లగా ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తూనే ఉన్నాయి. ఫుడ్ చైన్ లా.... ఈ డ్రగ్ కేసుల లింకు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో హీరోయిన్ సోదరుడు ఈ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్టయ్యాడు...

ప్రముఖ బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ గాళ్ ఫ్రెండ్ గాబ్రియెల్లా సోదరుడిని ఎన్ సి బి బెయిల్ పొందిన తరువాత అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విషయం ఏంటంటే...సుశాంత్ సింగ్ కేసులో తాజాగా జాతీయ మీడియా కథనాల  ప్రకారం.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో హీరోయిన్ సోదరుడిని మరోసారి అదుపులోకి తీసుకుంది.  గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ సోదరుడు అగిసిలాస్ ని ఎన్.సి.బి మరోసారి విచారించనుంది. ఈ విచారణ కోసం కొన్ని కీలక అంశాలను నోట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ డ్రగ్స్ కేసులో గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ సోదరుడు అగిసిలాస్ కు గతంలో బెయిల్ మంజూరు చేసినట్లు వార్తాకథనాలు వినిపించాయి .

కానీ తాజా వార్తా కథనాల ప్రకారం ఎన్ సి బి మాజీ ధర్మ ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ ప్రసాద్ ను ప్రత్యేక డ్రగ్స్ స్వాధీనం కేసులో అరెస్టు చేశాక.. ఇతరుల వివరాలు వెల్లడయ్యాయి. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి క్షితిజ్ ప్రసాద్ ను అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేక ఎన్.డిపిఎస్ కోర్టు నుండి బుధవారం ఎన్.సిబికి అనుమతి లభించిందని వార్తాకథనాలు జోరుగా వినబడుతున్నాయి. మొదట్లో అగిసిలాస్ డెమెట్రియేడ్స్ కు డ్రగ్స్ ముఠా కు సంబంధం ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ రాగా ... ఆయన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు ఇప్పుడు రెండోసారి విచారణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అగిసిలాస్ పాస్ పోర్ట్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో జమ చేయాలని అగిసిలాస్ డెమెట్రియేడ్స్ ను కోర్టు ఆదేశించినట్లు సమాచారం. ఈ విచారణ అనంతరం ఇంకొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: