ఎన్టీఆర్ రావడమే ఆలస్యం. సినిమాని పట్టాలెక్కించేస్తాడు.ఇక ఇప్పుడు ఎన్టీఆర్ 'RRR'షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత తారక్.. త్రివిక్రమ్ సినిమాని సెట్స్ పై తీసుకెళ్లనున్నాడు.ఇదిలా ఉంటె ఈ సినిమాలో ఇప్పుడు కథానాయిక ఎంపికపై కూడా త్రివిక్రమ్ ఓ స్పష్టమైన అవగాహనకు వచ్చేశాడని సమాచారం. ఈ సినిమాలో కథానాయికగా చాలామంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పూజా హెగ్డే పేరు దాదాపు ఖాయం అనుకుంటున్నారు. అయితే. హీరోయిన్ విషయంలో త్రివిక్రమ్ ఓ ట్విస్ట్ ఇచ్చినట్టు టాక్. పూజాని పక్కన పెట్టి, కీర్తి సురేష్‌ని ఎంచుకోవాలని భావిస్తున్నాడట.
అజ్ఞాతవాసిలో కీర్తిని ఏరి కోరి ఎంచుకున్నాడు త్రివిక్రమ్.అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అందుకే. ఈసారి హిట్ సినిమా ఇవ్వాలని ఫిక్సయ్యాడట. ఎన్టీఆర్ - పూజా కాంబోని గతంలో వచ్చిన అరవింద సమేత సినిమాలో చూసేశారు ప్రేక్షకులు. అందుకే ఈ సారి ప్రెష్ ఫేస్ ఉంటే బాగుంటుందని భావించిన త్రివిక్రమ్.. కీర్తీ సురేష్ ని సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.మరి ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్, కీర్తి ల జంటని మొట్ట మొదటిసారి వెండితెరపై చూడవచ్చు.ఇక వార్తలో నిజం ఎంతో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు...!!