బిగ్ బాస్ 4 ఆట ఇప్పుడు పదో వారానికి చేరుకుంది. మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ప్రేక్షకులకి వస్తోంది. రోజు రోజుకి  ఆట మరెంత రంజుగా మారింది. ఇప్పటికే మంచి మంచి టాస్కులతో కంటెస్టెంట్స్ అదరగొడుకున్నారు. 19 మంది బిగ్ బాస్ టైటిల్ కోసం రాగా.. ఇప్పుడు కేవలం  9 మంది మాత్రమే మిగిలారు. మరి ఎవరు టైటిల్ ని కొడతారో ఆసక్తికరంగా మారింది. అయితే అద్భుతంగా సాగుతున్న ఈ సీజన్ లో కాంటెస్టెంట్స్ గురించి సీజన్ 2 కంటెస్టెంట్ గీతా మాధురి పలు విషయాన్ని షేర్ చేసుకుంది.  

యాంకర్ అరియానా గ్లోరీ పై  గీతా మాధురి ప్రశంసలు కురిపించింది. అరియానా నాకు చాలా జన్యున్‌గా అనిపిస్తుంది.. క్యూట్‌గా ఉంది. అవతల వ్యక్తికి ఏం చెప్పాలని అనుకుంటుందో కుండబద్దలు కొట్టినట్టు చెప్తుంది అని సింగర్ గీతా మాధురి చెప్పడంజరిగింది. అంతే కాదు ఆ విషయంలో నాకు చాలా నచ్చుతుంది. చాలా స్టైట్ ఫార్వర్డ్‌గా అనిపిస్తుంది. తనది క్లీన్ హార్ట్, ప్లెయిన్ హార్ట్ అనిపిస్తుంది. చాలా మంచి అమ్మాయి. ఆమెను చూస్తే పాపం అనిపిస్తుంది అని గీతా చెప్పడమా జరిగింది. నిజానికి ఆమెకు నామినేట్ చేయాలని ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో టాస్కే జీవితం అని టాస్క్ ఎలాగైనా ఆడాలని ఆడాల్సిన అవసరం లేకపోయినా ఆడుతోంది.

ఇక మోనాల్‌‌కి తెలుగు భాష రాదు అయినా బిగ్ బాస్‌కి రావడంతో మొదట్లో చూసి భాష రాని అమ్మాయి వచ్చింది ఎలా ఆడుతుందో అనుకున్నాను  కానీ ఆమె హౌస్‌లో ఉండటానికి చాలా కష్టపడుతుంది అని అంది. హారిక అయితే ఎప్పుడు చాలా చిల్‌ అవుతూ ఉంటుంది అని గీతా అంది. గేమ్ విషయంలో టఫ్‌గా ట్రై చేస్తే బాగుంటుంది అని తన అభిప్రాయం చెప్పింది. బయటకు చాలా హాయిగా ఉంటుంది ఈమె అని అంది. అలానే లాస్య కూడా గేమ్‌పై ఫోకస్ పెట్టాలి అని గీతా చెప్పింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: