ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..కరోనా వైరస్  ప్రభావం సినిమా ఇండస్ట్రీలపై తీవ్ర ప్రభావం చూపించిందని అందరికి తెలుసు. ఆ కారణంగా నిర్మాతలు అందరూ థియేట్రికల్ రిలీజ్ వదిలేసుకొని ఓటీటీలో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఒకట్రెండు మినహాయిస్తే ఇప్పటివరకు ఓటీటీలో వచ్చినవి చిన్న సినిమాలే. అయితే ఇప్పుడు సూర్య లాంటి స్టార్ హీరో నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ అయ్యింది.బ్లాక్ బస్టర్ టాక్ తో కనీ వినీ ఎరుగని వ్యూస్ తో దూసుకుపోతుంది. సుధా కొంగర చాలా అద్భుతంగా తెరకేక్కించింది ఈ సినిమాని. కచ్చితంగా ఇదొక మాస్టర్ పీస్ అని చెప్పలి. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యుంటే కలెక్షన్ల వర్షం కురిపించేది. ఇక ఇలాంటి ఈ అద్భుతమైన  సినిమా ఆన్లైన్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటన వచ్చినప్పుడు అందరూ షాక్ అయ్యారు. సూర్య లాంటి పెద్ద హీరో ఇంకొంతకాలం సినిమాను హోల్డ్ చేసి థియేటర్లో రిలీజ్ చేయలేరా అనే ప్రశ్నలు ఎదురయ్యాయి.


ఈ విషయంలో తమిళనాడు ఎగ్జిబిటర్లు సూర్యతో గొడవకి దిగారు. అయినా సరే.. సూర్య మాత్రం వెనక్కి తగ్గలేదు. తనకు ఎన్ని హెచ్చరికలు వచ్చిన వెనుకడుగు వేయకుండా తన సినిమాను ప్రైమ్ లో రిలీజ్ చేశాడు. అయితే ఇది తాను ఇష్టపూర్వకంగా తీసుకున్న నిర్ణయం కాదని సూర్య తాజాగా వెల్లడించాడు. థియేటర్ల పునః ప్రారంభం కోసం ఎదురుచూడలేని పరిస్థితి తనకు ఎదురైనట్లు చెప్పాడు. తన నిర్మాణంలో ఏడు సినిమాలు సెట్స్ మీద ఉన్న సమయంలో కరోనా వచ్చిందని..


దీంతో ఈ సినిమాల్లో భాగమైన వ్యక్తులకు చెందిన వందల కుటుంబాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాడు. ఏది ఏమైనా సూర్య తీసుకున్న ఈ నిర్ణయానికి హాట్స్ ఆఫ్ చెప్పాలి.. ఇలాంటి మరెన్నో మూవీ విశేషాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. మరిన్ని విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: