లెక్కేసి కొడితే సరిగ్గా ఆర్నెళ్లలో సినిమా థియేటర్స్ లో ఉండాలంటున్నాడు చిరంజీవి. అందుకే కొరటాల శివకు కూడా బల్క్ డేట్స్ ఇచ్చేసాడు చిరంజీవి. నవంబర్ 9 నుంచే ఆచార్య సెట్ప్ పైకి వెళ్తుందనుకున్నా కూడా చిరంజీవికి కరోనా వచ్చిందనే వార్తలు వచ్చాయి. చిరు స్వయంగా తనకు కరోనా వచ్చిందని తెలిపాడు.కానీ అది తప్పుడు రిపోర్ట్ అని రెండు రోజుల తర్వాత తెలిసింది.కరోనా వచ్చిందని తెలియగానే మరో 15 రోజులు వాయిదా పడిందని అర్థమైపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ ప్లాన్స్ అన్నీ మార్చేసాడు కొరటాల శివ. షెడ్యూల్ అంతా సిద్ధం చేసాడు దర్శకుడు కొరటాల. జనవరి వరకు షూటింగ్ మొదలుపెట్టకూడదని ముందు అనుకున్నా కూడా ఇప్పుడు ఫిబ్రవరి లోపు ఆచార్యకు ముగింపు ఇవ్వాలని చూస్తున్నాడు చిరంజీవి.
పాపం ఇప్పటికే కొరటాల రెండేళ్లుగా ఇదే సినిమాపై ఉండటంతో ఇంకా వేచి చూపించకూడదని ఫిక్సయ్యాడు మెగాస్టార్. పైగా కాజల్ కూడా త్వరలోనే షూటింగ్ కు వస్తానంటుంది. నెల రోజుల తర్వాత షూటింగ్ మొహమే చూడనని చెప్పిన చందమామ.. మధ్యలో మనసు మార్చుకుంది. హనీమూన్ నుంచి వచ్చిన వెంటనే ఆచార్య కోసం వచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.ఈ క్రమంలోనే దర్శకుడు కొరటాల శివ కూడా షెడ్యూల్‌కు కావాల్సిందంతా సిద్ధం చేసుకుంటున్నాడు. నవంబర్ చివర్లో మొదలు పెడితే.. ఫిబ్రవరి వరకు అంతా పూర్తి చేయాలని చూస్తున్నాడు.ఇక వచ్చే ఏడాది సమ్మర్ ల్ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు...!!