2018లో పూర్తి చేసిన ఈ సినిమాను మోహన్ బొమ్మిడి డైరెక్ట్ చేశారు సత్యదేవ్ సరసన ప్రియా లాల్ హీరోయిన్ గా నటించింది. మ్యూజిక్ ప్రాధాన్యతతో వస్తున్న సినిమాగా అనిపిస్తున్న గువ్వా గోరింక సినిమా ఓటిటి రిలీజ్ కన్ ఫాం చేశారు మేకర్స్. అంటే ఈ ఇయర్ సత్య దేవ్ కు ఇది 3వ ఓటిటి రిలీజ్ సినిమా అని చెప్పొచ్చు. ఓటిటి సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సత్య దేవ్ డిఫరెంట్ స్టోరీస్ తో సత్తా చాటుతున్నాడు.
సత్య దేవ్ ప్రస్తుతం గుర్తుందా శీతాకాలం అంటూ తమన్నాతో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మరో హీరోయిన్ మేఘా ఆకాష్ కూడా నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత తిమ్మరుసు అనే సినిమాను చేస్తున్నాడు సత్య దేవ్. అతని సినిమా కథలే కాదు టైటిల్స్ కూడా వెరైటీగా ఉండేలా చూసుకుంటాడు. మరి సత్య దేవ్ ఇలానే ఫాం కొనసాగించి స్టార్ క్రేజ్ తెచ్చుకోవాలని ఆశిద్దాం.