ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది..ఈ సినిమా మొత్తాన్ని ఆనంద్ దేవరకొండ తన భుజాల మీద వేసుకుని నడిపించాడు.. సినిమా మొత్తం ఆనంద్ చుట్టే తిరుగుతుంటుంది. రాఘవ పాత్ర కు ఊపిరిపోసినట్లే నటించాడు. తొలి సినిమా కి ఈ సినిమా కి నటన లో చాలా పరిణితి కనపరిచాడు. సొంతంగా హోటల్ పెట్టుకొని జీవితంలో సెటిల్ అవ్వాలని ఓ కుర్రాడు పడే ఆరాటం ఆనంద్ లో కొట్టిచ్చినట్లు కనపడింది.. మన పక్కింటి అబ్బాయి ని చూసినట్లే ఉంది సినిమా చూస్తున్నంత సేపు. ఎమోషనల్ సీన్స్ లో, కామెడీ టైమింగ్ పట్టడంలో ఆనంద్ కి పోటీ ఎవరు లేరు.సగటు పక్కింటి కుర్రాడిగా కనిపించే ఫీచర్స్ ఉండటంతో యూత్ కి తొందరగా కనెక్ట్ అవుతూ ఉంటాడు ఆనంద్. ఇందులోనూ రాఘవ అనే మంచి పాత్రలో చెలరేగిపోయాడు.
ఇక వర్ష బొల్లమ్మ ఈ సినిమా లో ఎంతో న్యాచురల్ గా నటించింది.. తెలుగులో రెండో సినిమా చేస్తున్న వర్ష ఆనంద్ తో మంచి కెమిస్ట్రీ వర్క్ అవుట్ చేసింది.. ఈ పెయిర్ ని చూస్తుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది.. కొన్ని కొన్ని సీన్స్ లలో వర్ష అదరగొట్టింది. స్నేహితుడి పాత్ర చేసిన చైతన్య గరికపాటి మంచి కామెడీ టైమింగ్ తో అలరించాడు. ఈ పాత్ర కు తాను తప్ప మరెవరు సూట్ ఎవరు అనే రేంజ్ లో నటనను కనపరిచాడు. ఇక ఈ సినిమా లో ముఖ్యంగా చెప్పాల్సింది హీరో తండ్రి పాత్ర చేసిన గోపరాజు రమణ. రియలిస్టిక్ గా ఎంతో సహజంగా తన పాత్రలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఆనంద్, రమణ లమధ్య మంచి ఫన్ జెనరేట్ అయ్యింది.. మిగితా పాత్ర దారులు తమకు శక్తికి మంచి మంచి నటన కనపరిచారు. ఈ సినిమా మొదటినుంచి కథ బలం ఉన్న చిత్రం గా చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.. కథ ను అంత నమ్మారు కాబట్టే సినిమా కి ఇప్పుడు అంత మంచి పేరొచ్చింది..ఓ మంచి కథ ను రాసి దాన్ని ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించిన విధానం చూస్తుంటే వినోద్ స్టార్ డైరెక్టర్ అయ్యే సూచనలు చాలానే కనిపిస్తున్నాయి. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇలాంటి పాత్రలు సన్నవేశాలు జరిగినవి కదాని పదే పదే మెదడులో తడుతూనే ఉంటుంది.