ఇక బుల్లితెరపై ఆలీతో సరదాగా షో ఎంతో టాప్ రేటింగ్ ను సొంతం చేసుకొని దూసుకు పోతూ ఉంటుంది. ఈ షో కి వచ్చిన గెస్ట్ లందరిని కూడా ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూ ఎన్నో కొత్త విషయాలను అభిమానులకు తెలిసేలా చేస్తూ ఉంటాడు కమెడియన్ అలీ. ఇక పాత కొత్త అనే తేడా లేకుండా అందరు సెలబ్రిటీలు షో కి వస్తూ ఉంటారు. కమెడియన్ అలీకి అందరితో మంచి సంబంధాలు ఉండడంతో ఈ షోలో అందరూ ఎంతో కూల్గా అలీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఉంటారు. ఇక ప్రతీ వారం కూడా ఓ సరికొత్త గెస్ట్ ఆలీతో సరదాగా అనే షో కి ఎంట్రీ ఇచ్చి తమ పర్సనల్ విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.
అయితే చాలా మందిలో ఒక అనుమానం ఉంది. ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చే గెస్ట్ లకు ఎంత పారితోషికం ఇస్తారు అన్న అనుమానం ఉంది. కాగా ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి వచ్చే అతిథులకు ఒక లక్ష రూపాయల వరకు పారితోషికం ఇస్తారు అని వాళ్ళ రేంజ్ను బట్టి ఫ్లైట్ టికెట్ లో తీసుకువచ్చి హోటల్ ఖర్చులు భరించి పారితోషకం చెల్లిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కాస్త రేంజ్ ఉన్న సెలబ్రిటీలకు షోకి వస్తే లక్ష కంటే మించి కూడా పారితోషికం ఇస్తారు అనే టాక్ వినిపిస్తోంది. ఇక సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన వారు మాత్రం ఫ్రీగానే షోకి వస్తారట.