ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఆచార్య అనే సినిమా తెరకెక్కుతుంది అనే విషయం తెలిసిందే. సైరా నర్సింహారెడ్డి లాంటి  హిస్టారికల్ మూవీ తర్వాత చిరంజీవి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగానే కొరటాల శివ ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దర్శకుడుగా  టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు కొరటాల శివ తెరకెక్కించిన అన్ని సినిమాలు కూడా మంచి విజయాలను అందుకునీ  దూసుకుపోయాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిరంజీవి తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం కాబోతుంది అని ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు.



 కొరటాల శివ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై రోజురోజుకూ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అంతే కాదు సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఇక మెగా అభిమానులందరూ చిరంజీవి సినిమాకు సంబంధించి అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఆచార్య సినిమా లో చిరంజీవి ని విలన్ పాత్రలో ఎవరు నటించబోతున్నారనే దానిపై  గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్లో ఆసక్తికర టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది పేరు తెర మీదికి వచ్చి వైరల్ గా మారిపోతున్నాయి.



 తాజాగా మరో పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో మెగాస్టార్ ను ఢీకొన్న బోయే విలన్ పాత్రలో తమిళ స్టార్ హీరో అరవిందస్వామి నటించబోతున్నట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది.  కరోనా  వైరస్ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్  నవంబర్ 20 నుంచి ప్రారంభం కానుండగా చిరంజీవి పాల్గొననున్న విషయం తెలిసిందే.  ఇక ఇదే షెడ్యూల్లో అటు విలన్ పాత్రధారి కూడా చిత్రబృందం తో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: