మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'అరవింద సమేత'.ఈ సినిమా 2018 లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై కె.ఎస్. రాధాకృష్ణ నిర్మించారు. ఇక మొట్టమొదటి సారి త్రివిక్రమ్.. తారక్ ని సరికొత్తగా చూపించాడు ఈ సినిమాలో. ఎన్టీఆర్, పూజా ల కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చిందనే చెప్పాలి అయితే  ఈ సినిమాతోనే ఫస్ట్ టైం ఎన్టీఆర్ తో కలిసి నటించింది పూజ.ఆ సినిమా ఇచ్చిన స్వీట్ మెమోరీస్ ని గుర్తు చేసుకొని.. ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది పూజా హెగ్డే.

 అవేంటంటే  "ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకొవడం అద్భుతం అని, అరవింద సమేత సినిమా ఎప్పటికి తనకి ప్రత్యేకం అని, ఆ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించడం సూపర్ అంటుంది. ఎన్టీఆర్ కి నాకు ఎనేర్జి లెవల్స్ కొంచెం ఎక్కువ. దానివలన ఆన్ స్క్రీన్ లో మా జోడి కి ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేశారు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు. ఆఫ్ స్క్రీన్ లోను ఈ సినిమా చాలా అనుభవాలను మిగిల్చింది. అరవింద సమేత అప్పటినుండి నా డబ్బింగ్ నేనే చెప్పుకుంటున్నాను. అది కేవలం త్రివిక్రమ్ గారివల్లే" అంటూ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ని ఆకాశానికెత్తేస్తుంది పూజ హెగ్డే.ఇదిలా అరవింద సమేత సినిమా తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠ పురములో ' సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా నటించింది పూజా.

 ఆ సినిమా ఏకంగా ఇండ్రస్టీ హిట్ గా నిలిచింది. ఇక అక్కడితో ఈ అమ్మడికి వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. టాలీవుడ్ లో ఇప్పుడు అగ్ర హీరోల సరసన నటించేందుకు దర్శక నిర్మాతలు అందరూ పూజా నే కావాలంటున్నారు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో గోల్డెన్ లెగ్ గా మారిపోయింది ఈ పొడుగుకాళ్ళ సుందరి.ఇక ప్రస్తుతం పూజా హెగ్డే.. ప్రభాస్ సరసన రాధేశ్యామ్...మరియు అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: