తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి వారసుడు రానా కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. దగ్గుబాటి వారసుడు గా ఎంటర్ ఐనప్పటికీ తనదైన నటనతో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు రానా. ప్రస్తుతం వైవిధ్యమైన నటనకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన రానా ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో నటించి తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి పాత్రకు ప్రాణం పోయేగల సత్తా రానా సొంతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రానా ఏదైనా పాత్రలో నటిస్తున్నాడు అంటే ఇక ఆ పాత్రలో నట విశ్వరూపం చూడబోతున్నాం అని అటు ప్రేక్షకులు కూడా భావిస్తూ ఉంటారు.




 ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్ గా  కూడా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు రానా. కాగా  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహుబలి సినిమాలో బల్లాల దేవా పాత్రలో నటించిన రానా నటనను  ఇప్పటికి కూడా తెలుగు ప్రేక్షకుల మరువలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఏకంగా  ప్రేక్షకులు కనీవినీ ఎరుగని రీతిలో కృరత్వాన్ని చూపించి అసలుసిసలు విలన్ అంటే ఇలాగే ఉండాలి అని నిరూపించుకున్నాడు రానా. ఇక ప్రస్తుతం విరాటపర్వం అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. అంతే కాకుండా మరో వైవిధ్యమైన సినిమాలో కూడా నటిస్తున్నారు రానా.



 కాగా ఇటీవలే అక్కినేని వారి కొడులు  సమంత నిర్వహిస్తున్న టాక్ షో సామ్ జామ్ కీ  గెస్ట్ గా వచ్చారు దగ్గుబాటి రానా. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకోగా.. అభిమానులకు చేదు వార్త చెప్పారు. తన జీవితం వేగంగా ముందుకు వెళ్తున్న సమయంలో ఒక చిన్న పాస్ బటన్ వచ్చిందని.. పుట్టినప్పటినుంచి బీపీ ఉన్న కారణంగా గుండెకు సమస్య తలెత్తుతుందని.. తద్వారా మెదడులో నరాలు చిట్టి పోయేందుకు 70%, మరణించేందుకు 30 శాతం అవకాశం ఉంది అంటూ చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు దగ్గుబాటి రానా. దీంతో అభిమానులందరూ విషాదంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: