బిగ్ బాస్ లో రొమాన్స్ కు కొదవ లేదు.. అన్నీ కెమెరాలు ఉన్నా కూడా కొన్ని జంటలు విపరీతంగా రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు.. అర్థ రాత్రులు చీకటి రొమాన్స్ ను కోరుకుంటున్నారు.. అయితే అందరిలో కన్నా గుజరాతీ బ్యూటీ మోనాల్ మాత్రం కనిపించిన మగాడితో రొమాన్స్ చేస్తుంది. మొదట్లో అభిజిత్, తర్వాత అఖిల్ .. అఖిల్ తో చేసిన హాట్ హగ్ లు, ముద్దులు మాత్రం ప్రేక్షకుల విమర్శలకు దారితీసింది.. అయిన వీటి మీద బిగ్ బాస్ కూడా ఏమి అనకుండా టీఆర్పీ రేటింగ్ కోసం ఇంకా ఎంకరేజ్ చేయడం గమార్హం..



నామినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే.. రెడ్ క్యాప్.. గ్రీన్ క్యాప్.. క్యాప్‌లు ఒకటే కానీ ఆ క్యాప్‌ లోపల రెడ్, గ్రీన్ రంగులు ఉంచారు. బజర్ మోగగానే ఇంటి సభ్యులంతా పరుగున వెళ్లి ఎవరికి దక్కిన క్యాప్‌ని వాళ్లు తలపై పెట్టుకోవాలి. అయితే గ్రీన్ కలర్ ఉన్న క్యాప్ దక్కించుకున్న వాళ్లు ఈవారం నామినేషన్స్ నుంచి సేవ్ అవుతుండగా.. రెడ్ కలర్ ఉన్న క్యాప్ పెట్టుకున్నవాళ్లు నామినేట్ అయినట్టు. తాజాగా ప్రోమోలో అభిజిత్, అవినాష్, అరియానా, అఖిల్‌లు రెడ్ క్యాప్‌లు పెట్టుకోవడం వాళ్లు ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయినట్లు తెలుస్తోంది..



అవినాష్ ఒక వైపు మోనాల్ ను టార్గెట్ చేయగా మరో వైపు ,అఖిల్ మోనాల్ పై చురకలు వేశారు..దాంతో అఖిల్ కు మోనాల్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. రెండుసార్లు మోనాల్‌ని నామినేషన్‌లోకి నెట్టి ఎలిమినేట్ చేయాలని చూసిన అఖిల్‌ని సేవ్ చేయడానికి మోనాల్ ససేమిరా అంటోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ స్వాప్ కానని చెప్పేసింది. దీంతో అఖిల్.. ‘నువ్ నాకు చాలా సపోర్ట్ చేసానని అనుకుంటున్నావ్.. అసలు ఎక్కడ నాకు సపోర్ట్ చేశావు’ అని అఖిల్ అడగడంతో  చేసినవి గుర్తుపెట్టుకొని చేయలేను. అంటూ ఇద్దరి మధ్య కాసేపు భారీ వాగ్వాదం జరిగింది.మోనాల్‌-అఖిల్ వాదన హైలైట్ అవుతుండగా.. అఖిల్‌కి జలక్ ఇస్తూ అభిజిత్ కోసం మోనాల్ తనంతట తాను నామినేషన్స్‌లోకి వెళ్తున్నట్టుగా చూపించారు. కానీ హారిక కెప్టెన్ పవర్‌తోనే అలా జరిగిందా మోనాల్ కావాలని వెళ్లిందా అనేది తెలియాల్సి ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: