ముఖ్యంగా సి8సినిమాలోని 'బుట్టబొమ్మ' పాట, మరియు 'రాములో రాముల' పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని ఎన్నో రికార్డ్స్ ని సొంతం చేసుకున్నాయి. ఇక మన 'బుట్టబొమ్మ' పాట గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది చెప్పండి..ఈ ఎడాది సంక్రాంతి కి విడుదలైన ఈ సినిమా.. మరో సంక్రాంతి రాబోతోంది.. అయినా కూడా ఈ సినిమా రికార్డులు ఆగడం లేదు. రోజుకో రికార్డ్ అన్నట్లుగా.. ఏదో ఒక రికార్డ్ ఈ సినిమా పేరిట నమోదు అవుతూనే ఉంది. రెండు రోజుల క్రితం ఈ చిత్రంలోని 'బొట్టబొమ్మ' వీడియో సాంగ్ 450 మిలియన్లు వ్యూస్ సాధించి రికార్డ్ కొడితే.. తాజాగా ఇదే పాట 3 మిలియన్ ప్లస్ లైక్స్ సాధించి రికార్డు సాధించినట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది.
అంతేకాదు.. 3 మిలియన్ ప్లస్ లైక్స్ సాధించిన వీడియో సాంగ్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి స్థానాన్ని ఈ పాట అందుకున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది.ఇలా ఏదో ఒక రికార్డ్ ఈ చిత్రం సృష్టిస్తూ.. విడుదలై సంవత్సరం కావస్తున్నా.. ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంది.మొత్తానికి మన బన్నీ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ చేరిందన్న మాట.మరి ముందు ముందు ఈ సినిమాలోని పాటలు ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి..ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు...!!