ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో యువ దర్శకుల హవా నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది కొత్త తరం దర్శకులు ఇండ్రస్టీ కి పరిచయం అయి.. అందులో కొంతమంది మాత్రం తొలి సినిమా తోనే అతిపెద్ద విజయాన్ని సొంత చేసుకున్న వారున్నారు. అందులో యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఒకడు. అలనాటి నటి సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా 'మహానటి' సినిమాను తెరకెక్కించి భారీ హిట్ ని అందుకున్నాడు ఈ డైరెక్టర్. కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఏకంగా నేషనల్ అవార్డును దక్కించుకుంది. ఇక ఆ సినిమా విజయం తర్వాత నాగ్ అశ్విన్ ఎవరూ ఊహించని విధంగా ప్రభాస్‌తో ఓ భారీ చిత్రాన్ని ప్రకటించారు.

 సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో తెరకెక్కే ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన దీపికా పదుకోన్‌ కథానాయికగా నటించనున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. సుమారు 300 కోట్లపై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించనుంది.ఈ సినిమాలో భారీ యాక్షన్‌ ఉంటుందని తెలిసింది. అయితే కేవలం ప్రభాస్‌ మాత్రమే కాదు దీపికా పదుకోన్, అమితాబ్‌ బచ్చన్‌ పాత్రలు కూడా కీలకమైన యాక్షన్‌ సీన్స్‌లో పాల్గొంటాయన్నది తాజా టాక్‌. మామూలు ఫైట్స్‌ కాదు..దీపికా, అమి తాబ్‌ ఇరగదీసే సూపర్‌ ఫైట్స్‌ చేస్తారని సమాచారం. ఈ యాక్షన్‌ సనివేశాల్లో పాల్గొనేందుకు ప్రభాస్, దీపికా శిక్షణ కూడా తీసుకోనున్నారని టాక్‌.

అలానే అమితాబ్‌ బచ్చన్‌ది అతిథి పాత్ర కాదని, పూర్తి స్థాయి పాత్ర అని కూడా తెలిసింది.పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై ఇండ్రస్టీ లో భారీఅంచనాలే ఉన్నాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా అగ్ర నటీ, నటులు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని తెలుస్తోంది.వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్న ప్రభాస్.. ఆ తరువాత ఆదిపురుష్ సినిమాని పూర్తి చేసి.. ఆ తర్వాత నాగ్ అశ్విన్ ప్రాజెక్టు ను మొదలుపెట్టానున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: