శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ఫిదా. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 2017లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఆకట్టుకునే ప్రేమకథగా పలు రకాల రొమాంటిక్, ఎమోషనల్ అంశాలతో దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ సాయి పల్లవిల నటనకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. మరీ ముఖ్యంగా యువతని ఈ సినిమా విశేషంగా అలరించింది. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్ అందించిన అద్భుతమైన సంగీతం మరొక ఎసెట్ అని చెప్పాలి. మొత్తంగా ఈ సినిమా సక్సెస్ తరువాత టాలీవుడ్ లో హీరోయిన్ గా సాయి పల్లవి కి బాగా పేరు దక్కింది.

ఇక అక్కడి నుండి వరుసాగా అవకాశాలతో కొనసాగిన సాయి పల్లవి, ఇటీవల ధనుష్ తో కలిసి నటించిన మారి 2 సినిమాలోని రౌడీ బేబీ సాంగ్ తో యూట్యూబ్ లో ఏకంగా 1 బిలియన్ వ్యూస్ అందుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక ప్రస్తుతం రానాతో కలిసి విరాట పర్వం సినిమా చేస్తున్న సాయి పల్లవి వద్దకు ఇటీవల రెండు బడా సినిమాల అవకాశాలు వచ్చాయని, అయితే వాటి కథలు, అలానే అందులోని తన పాత్రలు తనకు నచ్చకపోవడంతో ఆమె వాటిని సున్నితంగా తిరస్కరించినట్లు చెప్తున్నారు. వాస్తవానికి నటిగా అలానే డ్యాన్సర్ గా కూడా మంచి పేరు కలిగిన సాయి పల్లవి, మొదటి నుండి తన ప్రొఫెషన్ పై మంచి దృష్టి గల అమ్మాయి అని, కష్టించి పైకి వచ్చిన తనకు లోటు పాట్లు తెలుసునని, అందుకే ఏ సినిమా పడితే ఆ సినిమా డబ్బుల కోసం ఒప్పుకుని ఆ తరువాత కెరీర్ పరంగా ఇబ్బందులు పడే టైపు ఆమె కాదని పలువురు ఆమె సన్నిహితులు చెప్తున్నట్లు తెలుస్తోంది.

తాను ఒప్పుకున్న సినిమాలకు పూర్తి న్యాయం చేయాలనేది తన తపన అని, అలానే ప్రేక్షకుల వద్ద నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే పెద్దగా ఇంట్రెస్టింగ్ గా లేని క్యారెక్టర్స్ ని ఆమె రిజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తుంటే తన సినిమాల ఎంపిక విషయమై సాయి పల్లవితో దర్శకనిర్మాతలకు అంత ఈజీకాదని తెలుస్తోందని, ఈ విధంగా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటూ కొనసాగితే ఆనతికాలంలోనే ఆమె మంచి నటిగా మరింత పేరు దక్కించుకోవడం ఖాయం అని పలువురు ప్రేక్షకులు ఆమె విషయమై అభిప్రాయపడుతూ పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: