నారా రోహిత్ ను గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమ ప్రత్యేక పాత్రలలోనే చూస్తుంది. ఎక్కడా ఫుల్ లెన్త్ రోల్స్ లో చూసింది లేదు. అయితే తాజాగా చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో అనగనగా దక్షిణాదిలో, శబ్దం, పండగలా వచ్చాడు. ఫిలింస్ హైలెట్ అవుతున్నాయి. ఈ మూడు సినిమాలు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లోనే ఉన్నాయి. అయితే ఈ గ్యాప్ లోను స్టోరీ నచ్చితే స్పెషల్ రోల్ చేయడానికి ఓకే అనేస్తున్నాడు.
తాజాగా నారా రోహిత్ ...బోయపాటి సినిమాకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది. బాలయ్యతో ఫస్ట్ టైమ్ రోహిత్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. అందులోనూ నెగిటివ్ రోల్ ఉన్న ఎమ్ ఎల్ ఏ పాత్ర కావడంతో సెంటరాఫ్ ది అట్రాక్షన్ అయ్యాడు. గతంలో లెజెండ్లో జగపతి ఇలాంటి నెగిటివ్ షేడ్ పాత్రనే చేసి మంచి మైలేజ్ దక్కించుకున్నాడు. మళ్ళీ అలాంటి సీనే ఇప్పుడు ఉంటుందని రోహిత్ ఫ్రెండ్స్ భావిస్తున్నారట.
ఇప్పటికే తన బెస్ట్ బడ్డీ శ్రీ విష్ణు సినిమాలో పలుసార్లు ప్రత్యేక పాత్రలు పోషించి శభాష్ అనిపించుకున్నాడు. అదే గుడ్ విల్ ఈ సారి బాలయ్య సినిమాతో కూడా కొట్టాలని చూస్తున్నాడు. ఇలా ప్రతిసారి ఎవరో ఒకరి సినిమాలో ప్రత్యేక పాత్రలు చేసే బదులు... తానే సోలో హీరోగా కంటెంట్ ఉన్న సినిమాలు చేసి హిట్ కొట్టవచ్చు కదా అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నా వినడం లేదనే టాక్ నడుస్తుంది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న మూడు సినిమాలలో ఒక్కటి హిట్ అయినా రోహిత్ సోలో హీరోగా బిజీ అవుతాడేమో చూడాలి.