ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర కథానాయికలలో కీర్తీ సురేష్ ఒకరు.ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'మహానటి'సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది కీర్తీ. అలనాటి నటి సావిత్రి గారి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తీ సురేష్ తన నటనతో అందరిని కట్టిపడేసింది. ఈమె నటనకు ఏకంగా నేషనల్ అవార్డు దక్కింది. ఇక ఈ సినిమా విజయంతో కీర్తీ కి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రెజెంట్ మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీ కాంత్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ యమ బిజీగా గడుపుతుంది కీర్తి సురేష్. ఈ లాక్ డౌన్ టైములో ఈమె నటించిన రెండు సినిమాలు ఓటిటి వేదికగా విడుదలయ్యాయి కానీ..అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

ఇదిలా ఉండగా.. నేషనల్ అవార్డు దక్కించుకోవాలి అనే కోరిక తన తల్లికి బలంగా ఉండేదని కీర్తి సురేష్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.నిజానికి కీర్తి సురేష్ తల్లి కూడా పెద్ద స్టార్ హీరోయినే..! సినీ పరిశ్రమ ఒకటిగా ఉండే రోజుల్లో… తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది కీర్తి సురేష్ తల్లి మేనక. తెలుగు, తమిళ్ తో పాటు మలయాళం కన్నడ భాషల్లో కలుపుకుని ఏకంగా 116 సినిమాల వరకూ నటించింది.మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'పున్నమి నాగు' చిత్రంలో కూడా మేనక హీరోయిన్ గా నటించింది. ఈమె కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైములో నిర్మాత జి.సురేష్‌ కుమార్ ను వివాహం చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది మేనక. ఈమెకు ఇద్దరు కూతుళ్లు.

ఒకరు రేవతి సురేష్ కాగా మరొకరు కీర్తి సురేష్‌.ఈ విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు. సో మొత్తానికి ఒకప్పుడు కీర్తీ తల్లి మేనక స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగితే.. ఇప్పుడు ఆమె కుమార్తె అయిన కీర్తీ సురేష్ అదే స్టార్ స్టేటస్ ని కొనసాగిస్తూ.. ముందుకు వెళ్తోందన్నమాట..ఇక ప్రస్తుతం కీర్తీ సురేష్.. ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీతో పాటు సూపర్ స్టార్ మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా జనవరిలో షూటింగ్ జరుపుకోనుంది పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: