మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా నూతన దర్శకుడు సుబ్బు డైరక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా త్వరలో రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా తర్వాత దేవా కట్ట డైరక్షన్ లో సాయి ధరం తేజ్ సినిమా ఉందని తెలిసిందే. ప్రస్థానం రేంజ్ లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడు దేవా కట్ట. ఈ సినిమా తో పాటుగా సుకుమార్ అసిస్టెంట్ కార్తిక్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు సాయి ధరం తేజ్. కెరియర్ లో ఫస్ట్ టైం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా సాయి ధరం తేజ్ ప్రయ్త్నం చేస్తున్నాడు.

సినిమా 1970 బ్యాక్ డ్రాప్ కథతో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో సుకుమార్ హ్యాండ్ ఉందని తెలుస్తుంది. అందుకే ఈ సినిమాపై సాయి ధరం తేజ్  ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది. తేజ్ కెరియర్ లో ఈ సినిమా డిఫరెంట్ అటెంప్ట్ అని తెలుస్తుంది. సుకుమార్ శిష్యుడు సినిమా కాబట్టి తప్పకుండా భిన్నంగా ఉంటుందని తెలుస్తుంది.

ఈ సినిమాలో సాయి ధరం తేజ్ క్యారక్టర్ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. తప్పకుండా సాయి ధరం తేజ్ ఈ కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు మెచ్చుతారని అంటున్నారు. లాస్ట్ ఇయర్ చిత్రలహరి, ప్రతిరోజూ పండుగే సినిమాలతో అలరించిన సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ తర్వాత రాబోయే సినిమాలతో కూడా సత్తా చాటనున్నాడు.          

మరింత సమాచారం తెలుసుకోండి: