ఎక్కడ ఎలాంటి విమర్శలు రాకుండా తనదైన నటనతో ఆకట్టుకుంటూ అందరినీ మెప్పిస్తూ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటు దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. అయితేపెళ్లి తర్వాత హీరోయిన్లకు కెరియర్ ఉండదు అని ఉన్న భావనను పటాపంచలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు వెబ్ రంగంలో కూడా రాణించేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే హోస్ట్గా సామ్ జామ్ అనే టాక్ షోను నిర్వహిస్తున్న సమంత అందరిని ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా అందరు సినీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది సమంత.
అయితే ఇప్పుటికే ఫ్యామిలీ మెన్ మొదటి సీజన్ ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఫ్యామిలీ మెన్ 2 లో నెగటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నది సమంత. సాధారణంగా ఇప్పుడు వరకు సమంత క్యూట్ గా అల్లరి పిల్లలా గా ఉండడానికి మాత్రమే అభిమానులు చూశారు కానీ ఈ వెబ్ సిరీస్ ద్వారా సమంత లోని కొత్త యాంగిల్ చూడబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఫ్యామిలీ మెన్ 2 కోసం సమంత నెగిటివ్ రోల్ కోసం పలు భాషల్లో సొంత డబ్బింగ్ చెప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. సమంత ఎంతో ఎగ్జైటింగ్ ఎదురుచూస్తున్న ఫ్యామిలీ మెన్ 2 నుంచి ఈ నెల నుండి స్ట్రీమింగ్ కావాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల జనవరి లేదా ఫిబ్రవరిలో నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.