ఈ ఏడాది సంక్రాంతి స్వీట్ గా  విడుదలై అరుదైర గైరవం దక్కించుకున్న సినిమా ‘అలా వైకుంఠపురములో’. త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, హాట్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా తెరకెక్కిన  ఈ సినిమా బాక్సాపీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ సినిమా 2020 సంక్రాతి దమాకాగా విడుదలై ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. స్టోరీ పరంగా మాంచి హిట్ ను అందుకుంటే.. అందులో ఉండే పాటలు ఈ సినిమాకు మరింత గౌరవాన్ని అందించిందనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు ఎస్. ఎస్. తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ఉండే ప్రతి ఒక్క పాట సూపర్ డూపర్ గా నిలిచాయి.
అందులోనూ.. బుట్ట బొమ్మా..బుట్ట బొమ్మా నన్ను సుట్టూకుంటివే అనే పాటకు మాములు క్రేజ్ లేదంటే నమ్మండి. ఈ పాటతోనే ఈ చిన్నదానికి బుట్ట బొమ్మా అనే పేరును సంపాదించింది. ఈ సినిమాకు పాటలే హైలెట్ గా నిలిచాయనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలో ఇతర పాత్రలో ప్రముఖ నటులు టబు, జయరాం, సుశాంత్, నవదీప్, నివేతా పేతురాజ్, సముద్రఖని, మురళి శర్మ లు కూడా అద్బుతంగా నటనించారు. ఇంత మంది కాంబినేషన్లలో వచ్చిన ఈ మూవీకి కలెక్షన్ల పరంగానూ రికార్డును క్రియేట్ చేసింది. ఈ మూవీ రిలీసై సంవత్సరం కావొస్తున్నా కానీ ఈ సినిమాకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా‘ అలా వైకుంఠపురములో’ ట్రైలర్ ఓ కొత్త రికార్డును క్రియేట్ చేసిందండోయ్..

అదేంటి ఎప్పుడో కదా రిలీస్ అయింది. మళ్లీ ట్రైలర్ రికార్డ్ క్రియేట్ చేయడమేంటని ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే ఈ మూవీ ట్రైలర్ వ్యూస్ పరంగా టాప్ 20 వ స్థానాన్ని దక్కించుకుని అరుదైన గౌరవం సంపాదించిందండోయ్. దేశం మొత్తం ఎన్నో భాషల్లో ఉన్న సినిమాల్లోంచి ఈ స్టైలీష్ స్టార్ సినిమా వ్యూస్ పరంగా 20 వస్థానాన్ని సంపాదించుకుందంటే అది గొప్ప విశేషమే కదా. అందులోనూ ఈ సినిమా జేమ్స్ బాండ్ మూవీ అయిన ‘నో టైమ్ టు డై’ ట్రైలర్ ను వ్యూస్ ను క్రాస్ చేసేసింది అలా వైకుంఠపురములో..  ఈ అరుదైన గౌరవం స్టైలీష్ స్టార్ కు రావడం పట్ల ఆయన అభిమానులు పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతే కదా మరి స్టైలీష్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటుందిలే

మరింత సమాచారం తెలుసుకోండి: