మాస్ రాజా రవితేజ పరిస్థితి ఏమీ బాగాలేదు.. అయన సినిమాలు ఒక్కోటి ఫ్లాప్ చేస్తూ అయన మార్కెట్ ను ఇంకా ఇంకా దిగజార్చుతున్నాయి. ఆయన సినిమాలు దాదాపు ఆరు  ఫ్లాప్ అయ్యాయి.. అప్పుడెప్పుడో రాజ ది గ్రేట్ సినిమా తో హిట్ అందుకున్న రవితేజ కి ఇప్పటివరకు హిట్ లేదంటే రవితేజ ఎంతలా డౌన్ లో ఉన్నాడో  అర్థం చేసుకోవచ్చు.. ఎంతో నమ్మకంతో చేసిన డిస్కో రాజ కూడా ఫ్లాప్ కావడంతో రవితేజ కి ఇప్పుడు హిట్ తప్పకుండా పడాల్సిన పరిస్థితి వచ్చింది..  దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలని తనకు అచ్చిచ్చిన డైరెక్టర్ తో చేతులు కలిపాడు..

తనకు డాన్ శ్రీను, బలుపు వంటి చిత్రాల హిట్ అందించిన గోపీచంద్ మలినేని తో క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు. శృతిహాసన్ కథానాయిక. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా సంక్రాంతికి రిలీజ్  ప్లాన్ చేస్తున్నారు.  అయితే క్రాక్ పెట్టుకున్న టార్గెట్ చాలా పెద్దగా ఉంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం దీని బడ్జెట్ ఇప్పటికీ ముప్పై కోట్లు దాటేసిందట. మాములు పరిస్థితుల్లో రవితేజ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఈ మొత్తం షేర్ రూపంలో ఈజీగానే వస్తుంది. కానీ ఇప్పుడు అదంత సులభం కాదు.

లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. మొన్న హైదరాబాద్ లో థియేటర్లు ఓపెన్ చేస్తే టెనెట్ కోసం మూడు రోజులు జనం మల్టీ ప్లెక్సులను ఫుల్ చేశారు కానీ నిన్నటి నుంచి చాలా చోట్ల డ్రాప్ స్పష్టంగా కనిపిస్తోంది. అది హాలీవుడ్ మూవీ కాబట్టి ఇంతకన్నా ఆశించలేం కానీ తెలుగు సినిమా వస్తేనే క్లారిటీ వస్తుంది.ఈ లెక్కన క్రాక్ సినిమా కి లాభాలు రావాలన్నా, నష్టంనుంచి తప్పించుకోవాలన్నా కనీసం వారం రోజులు హౌస్ ఫుల్ కలెక్షన్లు కావాలి.. అంతకుమించి సినిమా కి హిట్ టాక్ రావాలి.. లేదంటే రవితేజ పై ఇంత బడ్జెట్ పెట్టి సినిమా చేసిన నిర్మాతకు నష్టాలూ తప్పవు..

మరింత సమాచారం తెలుసుకోండి: