అందుకే ఈమధ్య కాస్త డల్ గా కనిపిస్తున్నాడు. కెమెరా ముందుకెళ్లి అరియానా గురించి మాట్లాడుతున్నాడు. ఇక శుక్రవారం ఎపిసోడ్ లో అభిజిత్ ముందు అరియానా టాపిక్ తీసుకురాగా అభిజిత్ అరియానాకు సపోర్ట్ పలకడంతో సోహెల్ కు మైండ్ బ్లాంక్ అయ్యింది. ఆమెకు నీతో ఏదైనా గొడవ ఉంటే నీ గురించి మాట్లాడాలి కాని పాత విషయాలు.. నీకు సంబంధం లేని విషయాలు ప్రస్థావించాల్సింది కాదని అభిజిత్ చెప్పాడు.
అభిజిత్ అలా చెప్పడం వల్ల సోహెల్ కి కూడా తను చేసింది తప్పే అని తెలిసినట్టు అవుతుంది. అరియానా, సోహెల్ ల మధ్య జరిగిన గొడవలో తప్పెవరిది అన్నది పక్కన పెడితే ఆ టైం లో సోహెల్ అరియానా మీద మీదకు వెళ్లడం అతన్ని బ్యాడ్ అయ్యేలా చేసింది. అయితే ఈ విషయం గురించి నాగ్ ఎలా రియాక్ట్ అవుతాడని అందరు ఎదురుచూస్తున్నారు. అది శనివారం ఎపిసోడ్ లో తెలుస్తుంది.