పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాట పాడించాలనే ఆలోచన వచ్చింది థమన్ కు.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఆల్రెడీ కాటమరాయుడా సాంగ్ పాడిన పవర్ స్టార్ అజ్ఞాతవాసి సినిమాలో కొడకా కోటేశ్వర రావు అంటూ సందడి చేశాడు. ఇక లేటెస్ట్ గా థమన్ మ్యూజిక్ డైరక్షన్ లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి సింగర్ అవతారం ఎత్తబోతున్నారని తెలుస్తుంది. దేవి, అనిరుధ్ లు మాత్రమేనా పవర్ స్టార్ తో నేను పాట పాడిస్తా అంటున్నాడు థమన్.

ప్రస్తుతం పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ తో పాటుగా సూపర్ హిట్ మళయాళ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ కు కూడా పవన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ తో ఓ సాంగ్ పాడించాలని ఫిక్స్ అయ్యాడట థమన్. ఆల్రెడీ ఈ సినిమా కోసం సాంగ్ కంపోజిషన్ రెడీ అయినట్టు టాక్. మళయాళ వర్షన్ లో ఆ సినిమాలో అసలు పాటలే లేవు కాని తెలుగులో పవర్ స్టార్ సినిమాకు కొన్ని అంచనాలు ఉంటాయి.

తప్పకుండా ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా అదరగొట్టాలని చూస్తున్నారు. థమన్ పవర్ స్టార్ సినిమాల ఆఫర్లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ రెండు సినిమాలకు తన మార్క్ మ్యూజిక్ అందించి సత్తా చాటలాని చూస్తున్నాడు. పవర్ స్టార్ తో థమన్ మ్యూజిక్ సూపర్ హిట్ అయితే కాంబో రిపీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: