తెలుగు చిత్ర పరిశ్రమలో మిల్కీబ్యూటీ తమన్నా కి ఉన్న క్రేజ్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ సమయంలోనే ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన తమన్నా తన మిల్కీ మిల్కీ అందాలతో తెలుగు ప్రేక్షకుల్ని మతి పోగొట్టింది అన్న విషయం తెలిసిందే.  ఎన్నో రోజుల పాటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తమన్నా  దాదాపు అందరు హీరోలతో సినిమాలు చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతే కాకుండా... కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంత గానో  ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు తమిళ కన్నడ  సినిమాల్లో కూడా ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది.



 చిత్ర పరిశ్రమకు పరిచయమై దాదాపు దశాబ్ద కాలం గడిచిపోతున్నది ఈ అమ్మడి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా బాహుబలి సినిమాలో అవంతిక పాత్రలో నటించిన తర్వాత తమన్నా క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది అన్న విషయం తెలిసిందే. కేవలం తన అందాలతోనే కాదు నటనతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది తమన్నా.  అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా తమన్నా యాక్టివ్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  అయితే ఇటీవలేసమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సామ్ జామ్  అనే టాక్ షో కి గెస్ట్ గా హాజరైన తమన్నా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంది.



 ఈ క్రమంలోనే మీరు కవితలు రాస్తారు అని విన్నాను అది నిజమేనా అంటూ సమంత తమన్నాను ప్రశ్నిస్తోంది..  అవును అప్పుడప్పుడు బాగా కవితలు రాస్తూ ఉంటాను అని...  హార్ట్ బ్రేక్ అయినప్పుడు కవితలు వాటంతట అవే వచ్చేస్తూ ఉంటాయి అంటూ తమన్నా సమాధానం చెబుతుంది. దీంతో వెంటనే స్పందించిన సమంత నా ఫ్రెండ్ తమన్నా హృదయాన్ని బద్దలు కొట్టిన ఆ వ్యక్తి ఎవరు అంటూ చెబుతూ ఉంటుంది దీనికి సంబంధించిన ప్రోమో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: