అలాగే స్వామి మణికంఠ సినిమాలో కూడా నటించాడు. అల్లరి నరేష్ హీరోగా రవిబాబు దర్శకత్వంలో వచ్చిన లడ్డు బాబు సినిమాలో భూమిక కొడుకుగా, హీరోని ఫాలో అయ్యే పాత్రలో నటించాడు అతులిత్. ఇలా చాలా సినిమాల్లోనే నటించి అందరిని మెప్పించాడు. అలాగే ప్రముఖ గాయకులు ఘంటసాల గారి మీద రూపొందిన బయోపిక్ లో కూడా నటించాడు అతులిత్. ఈ సినిమా టీజర్ 2018 లో విడుదలైంది. ప్రముఖ గాయకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాలో ఘంటసాల గారి పాత్ర పోషిస్తున్నారు. విడుదలైన ఈ టీజర్ ను చూస్తుంటే ఘంటసాల గారి చిన్నప్పటి పాత్రలో అతులిత్ నటించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరో హీరోయిన్లుగానో, లేక ఏదన్నా ముఖ్య పాత్రల్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఓ బేబీ సినిమాతో తేజ, వినవయ్యా రామయ్యా సినిమాతో నాగ అన్వేష్, ఆంధ్రా పోరి సినిమాతో ఆకాష్ పూరి, ఏబిసిడి సినిమాతో భరత్ ఇంకా ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇండస్ట్రీలోకి మళ్ళీ రీ – ఎంట్రీ ఇస్తున్నారు. వాళ్ళ అదృష్టం బాగుంటే హీరోలుగా కొనసాగుతున్నారు. లేదంటే దొరికిన పాత్రతో సర్దుకుపోతున్నారు. మరి భవిష్యత్తులో అతులిత్ కూడా మరిన్ని మంచి పాత్రలు చేస్తూ, హీరోగా మరిన్ని సినిమాలు చేసి, మన అందరి అభిమానాన్ని పొందాలని ఆశిద్దాం.