ఇక సూపర్ హిట్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఎంఎస్ రాజు కొంత విరామం తరువాత ఆయన దర్శకుడిగా మారి రూపొందించిన `డర్టీ హరి`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ ఈ నెల 18న ఫ్రైడే మూవీస్ ఏటీటీలో విడుదలవుతోంది. ఈ మూవీ తనకు కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందని ఎం.ఎస్. రాజు ఫుల్ కాన్ఫిడెన్స్ తో వున్నారు. మళ్లీ తన సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ ని ఘనంగా రీలాంచ్ చేయబోతున్నారట. ఈ క్రమంలోనే మహేష్‌తో ‘ఒక్కడు’ సీక్వెల్ నిర్మించేందుకు రెడీ అవుతున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఒక ఒక్కడు సినిమాని తమిళంలో విజయ్, త్రిష జంటగా ‘గిల్లి’ పేరుతో రీమేక్ చేస్తే అక్కడా భారీ విజయాన్ని అందుకుంది. కన్నడలో ‘అజయ్ ‘గా, బెంగాలీలో ‘జోర్’ గా, హిందీలో ‘తేవర్’ గా రీమేక్ చేస్తే పెట్టిన పెట్టుబడిని రాబడిగా మార్చింది. ఇక ‘డర్టీ హరి’ రిలీజ్ తర్వాత ‘ఒక్కడు’ సీక్వెల్‌పై ఫోకస్ పెట్టబోతున్నాడట ఎంఎస్ రాజు. మరి మహేష్ ఈ సినిమా సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..? ఇప్పటికే చాలా సినిమాలు మహేష్ కమిట్ అయి ఉన్నాడు. అటు దర్శకుడు గుణశేఖర్ కూడా రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు . ఇక స్టార్ డైరెక్టర్స్ అంతా రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక్కడు సినిమా స్టోరీకి సీక్వెల్ తీస్తారా ..? లేక మారిన ట్రెండ్ కు తగ్గట్టు మరో కథను సిద్ధం చేస్తారా .? అన్నది తెలియాల్సి ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి మరి.