అందుకే ఆడియెన్స్ అంతా అతనికే ఓటేశారు. ఇక ఈ సీజన్ విన్నర్ అభిజిత్ అవుతాడో లేదో మరో ఐదురోజుల్లో తెలుస్తుంది. ఇక హౌజ్ లో నుండి బయటకు వచ్చిన వారు కూడా అభిజిత్ ను ప్రమోట్ చేస్తున్నారు. అభిజిత్ కోసం ప్రచారంలో పాల్గొంటున్నారు. వారిలో యాంకర్ లాస్య ఉంది. హౌజ్ లో ఉన్నప్పుడు కూడా అభిజిత్ కు సపోర్ట్ గా ఉన్న లాస్య ఫైనల్ వీక్ లో అభిజిత్ కోసం ప్రచారం చేస్తుంది.
తను మాత్రమే కాదు లాస్య కొడుకు జున్నుతోని కూడా అభిజిత్ కు ఓటేయమని ప్రచారం చేస్తుంది. అభిజిత్ విన్నర్ అవడంలో బయట ఉన్న ఈ సీజన్ కంటెస్టంట్స్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. జున్ను క్యూట్ గా వోట్ ఫర్ అబ్జిజిత్ మామా అని ప్రచారం చేయడం మాత్రం సూపర్ గా ఉంది. తప్పకుండా ఈ సీజన్ విన్నర్ గా అభిజిత్ నిలుస్తాడని అన్ని ఓటింగ్ పోల్స్ చెబుతున్నాయి. ఇప్పటికే రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన బోయ్స్ ఎక్కడ ఉన్నా ఏం చేసినా సపోర్ట్ ఉండాలంటూ అభిజిత్ కు ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేశాడు.