త్రివిక్రమ్ శ్రీనివాస్, జూ.ఎన్టీఆర్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ మూవీ కోసం త్రివిక్రమ్ తన సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తున్నాడనే టాక్ వస్తోంది. సినిమా టైటిల్‌లో 'అ' ఫార్మాట్‌ని ఫాలో అయ్యే త్రివిక్రమ్, తారక్ మూవీకి మాత్రం ఈ సెంటిమెంట్‌ని పక్కనపెడుతున్నాడట. తన సెంటిమెంట్‌కి భిన్నంగా ఈ సినిమాకి 'రాజా వచ్చినాడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నాడట త్రివిక్రమ్.
త్రివిక్రమ్ సినిమా టైటిల్స్ ఎక్కువగా 'అ'తోనే స్టార్ట్ అవుతుంటాయి. 'అత్తారింటికి దారేది, అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత, అల వైకుంఠపురములో' ఇలా అన్నీ 'అ'తోనే మొదలయ్యాయి. తారక్ సినిమాకి కూడా ఈ 'అ' సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నాడనే ప్రచారం జరిగింది. ఈ లెక్కలతోనే 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ రిజిస్టర్ చేశారనే టాక్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు టైటిల్ మారుస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.
త్రివిక్రమ్, జూ.ఎన్టీఆర్ సినిమా ఈ సమ్మర్‌లోనే స్టార్ట్ కావాల్సింది. కానీ కరోనా లాక్‌డౌన్‌తో 'ట్రిపుల్ ఆర్' షూటింగ్‌కి బ్రేకులు పడ్డాయి. దీంతో త్రివిక్రమ్ మూవీ కూడా వాయిదా పడింది. అయితే అక్టోబర్‌లో రీస్టార్ట్ అయిన 'ట్రిపుల్ ఆర్' షూటింగ్ వచ్చే ఫిబ్రవరి కల్లా పూర్తవుతుందని సమాచారం. ఇక మార్చిలో త్రివిక్రమ్, తారక్ మూవీ సెట్స్‌కి వెళ్తుందని తెలుస్తోంది. మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ టైటిల్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తున్నాడు. అసలు ఆయన ఎందుకిలా మార్పు కోరుకుంటున్నాడో అని సినీలోకం సందేహాలు వ్యక్తం చేస్తోంది.